ఎర్రన్నకు బాబు, టీ, ఎపీ నేతల నివాళి(పిక్చర్స్)
హైదరాబాద్/శ్రీకాకుళం: అధికార లాంఛనాలతో దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు వర్ధంతిని శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎర్రన్న ఘాట్ వద్ద తల్లి కళావతి, భార్య విజయలక్ష్మి, కుమారుడు, ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, సోదరులు హరిప్రసాద్, ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కుటుంబ సభ్యులు పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రభుత్వ విప్ కూన రవి కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, ఎమ్మెల్యేలు గౌతు శ్యామ్‌సుందర్ శివాజీ, బగ్గు రమణమూర్తి, గుండ లక్ష్మీదేవి, మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబునాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, కలిశెట్టి అప్పలనాయుడు, ఎంపిపిలు, జెడ్పీటిసి సభ్యులు, అధికార యంత్రాంగం తరపున కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జెసి వివేక్ యాదవ్, అదనపు సంయుక్త కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, డిఆర్వో నూర్‌బాషా ఖాసీం ఎర్రన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జిల్లాకు వన్నెతెచ్చిన వ్యక్తి ఎర్రన్న అని కొనియాడారు. గత ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రిగా మారుమూల గ్రామానికి సైతం రోడ్ల నిర్మాణం, అభివృద్ది కార్యక్రమాలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి జిల్లాను అభివృద్ధిపథంలో పయనింపజేశారన్నారు. కాగా, హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా చంద్రబాబు సహా పలువురు నేతలు ఎర్రన్నకు నివాళులు అర్పించారు.

ఎర్రన్న
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దివంగత ఎర్రన్నాయుడికి చంద్రబాబు సహా తెలంగాణ, ఏపీ నేతలు ఆదివారం నివాళులు అర్పించారు.

ఎర్రన్న
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దివంగత ఎర్రన్నాయుడికి చంద్రబాబు సహా తెలంగాణ, ఏపీ నేతలు ఆదివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న చంద్రబాబు.

ఎర్రన్న
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దివంగత ఎర్రన్నాయుడికి చంద్రబాబు సహా తెలంగాణ, ఏపీ నేతలు ఆదివారం నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తూ బాబు.

ఎర్రన్న
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దివంగత ఎర్రన్నాయుడికి చంద్రబాబు సహా తెలంగాణ, ఏపీ నేతలు ఆదివారం నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తూ బాబు.

ఎర్రన్న
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దివంగత ఎర్రన్నాయుడికి చంద్రబాబు సహా తెలంగాణ, ఏపీ నేతలు ఆదివారం నివాళులు అర్పించారు.

ఎర్రన్న
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దివంగత ఎర్రన్నాయుడికి చంద్రబాబు సహా తెలంగాణ, ఏపీ నేతలు ఆదివారం నివాళులు అర్పించారు. ఆదివారం ఎర్రన్న రెండో వర్ధంతి.
-
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications