వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిలతో జగన్ మాట, విజయమ్మ సంబరం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

కడప: మరో నాలుగు నెలల్లో మీ అన్న, మనవడు, కొడుకు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కుతాడని, అంత వరకూ తాతలు, అవ్వలు, అన్నలు, అక్కలు, తండ్రులు ఓపిక పట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే వైయస్ స్వర్ణయుగాన్ని తెచ్చి ఆయన ప్రవేశపెట్టిన పథకాలతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చెప్పారు.

రైతులను ఆదుకోవడానికి వ్యవసాయశాఖలో రెండు మంత్రిత్వశాఖలను ఏర్పాటుచేస్తామన్నారు. 101, 102 పేరిట నెంబర్లు కేటాయించి విత్తనాలు, ఎరువులు, మార్కెట్ విధానం, క్రిమిసంహారక మందులు, రైతులకు నాణ్యమైన వాటిని అందించే బాధ్యతను ఒక మంత్రి, వ్యవసాయ రంగం అభివృద్ధి బాధ్యతలు మరోమంత్రి చూస్తారన్నారు. దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన 108,104, ఫీజు రీయింబర్స్‌మెంట్, పావలావడ్డీ రుణాలు, ఆరోగ్యశ్రీ, రేషన్‌కార్డులు, పెన్షన్లు, పక్కాగృహాలు పథకాలు పక్కాగా అమలుచేస్తామన్నారు.

ప్రతి పేదవారి మొఖంలో సంతోషం కలిగిస్తానని ఆయన శపథం చేశారు. రైతులను బాధపెట్టే ఏ ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు. రైతు బాగుంటే రాష్ట్రంతో పాటు దేశం బాగుపడుతుందన్నారు. అభివృద్ధి చెంది అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉంటుందన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు గంటలు నాణ్యమైన విద్యుత్‌ను నిరాటంకంగా సరఫరా చేసి మరో రెండు గంటలు కూడా భవిష్యత్‌లో ఉచితంగా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

బడ్జెట్‌లో ఆరువేల కోట్లు కేటాయించి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతామని, అవ్వలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు కోరిక మేరకు బెల్టు షాపులు రద్దు చేస్తామని, మద్యం ధరలు పెంచడం ద్వారా మద్యం బాబులకు గట్టి షాక్ ఇచ్చి అందర్నీ సుఖసంతోషాలతో జీవించే విధంగా చర్యలు తీసుకుంటామని జగన్ చెప్పారు.

కుటుంబం

కుటుంబం

ఇడుపులపాయలో ప్లీనరీకి ముందు వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్న వైయస్ జగన్, వైయస్ విజయమ్మ, షర్మిలలు.

వైయస్ విజయమ్మ

వైయస్ విజయమ్మ

వైయస్ హఠాన్మరణానంతరం జగన్‌ను మీ చేతుల్లో పెట్టానని, మీరు అన్నివిధాలా ఆదరిస్తున్నారని, అదే తీరు కొనసాగించి మంచి పాలనను చూడాలని వైయస్ విజయమ్మ అన్నారు.

విజయమ్మ

విజయమ్మ

వైయస్ మరణానంతరం తమ కుటుంబంపై ఉన్న ప్రజాదరణ చూడలేక, తమ కుటుంబాన్ని పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం పార్టీలు మానసిక క్షోభకు గురిచేశాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌కు బహుమానం

జగన్‌కు బహుమానం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎద్దుల బండి నమూనాను బహుమానంగా ఇస్తున్న దృశ్యం.

ప్లీనరీ

ప్లీనరీ

ఆరోగ్యశ్రీ కింద ఉన్న 133 జబ్బులను కిరణ్ కుమార్ రెడ్డి తొలగించారని, ఆ జబ్బులకు కూడా చికిత్సలు చేసి వైద్యానికి పెద్దపీట వేస్తామని జగన్ ప్లీనరీలో అన్నారు.

జగన్‌తో షర్మిల మాట

జగన్‌తో షర్మిల మాట

కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీలో సోదరి షర్మిలతో మాట్లాడుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి, పక్కన విజయమ్మ.

జగన్

జగన్

108, 104 సేవలను ప్రపంచంలోనే అత్యంత ఆధునిక పద్ధతుల్లో తీర్చిదిద్ది అందరికీ వైద్య సౌకర్యం కల్పించి ఆదుకుంటామని జగన్ చెప్పారు.

జగన్ 2

జగన్ 2

డ్వాక్రా మహిళల రుణాల చెల్లింపునకు గడువు పెంచుతామని, కొత్తగా రూ.20వేల కోట్లు కేటాయిస్తామని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

షర్మిలతో జగన్

షర్మిలతో జగన్

కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీలో సోదరి షర్మిలతో మాట్లాడుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి, పక్కన విజయమ్మ.

జగన్ 3

జగన్ 3

వికలాంగులకు ఇచ్చే పెన్షన్లను రూ.500లు నుంచి రూ.1000లకు పెంచి చేనేత, మత్స్య, గీత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని జగన్ అన్నారు.

జగన్ 4

జగన్ 4

రాష్ట్రవ్యాప్తంగా లక్షా 27వేల కోట్లరూపాయల రైతు రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు.

షర్మిల

షర్మిల

తన సోదరుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంత నిబ్బరం కలిగిన వాడనే విషయం తనకు కూడా తెలియదని ఆయన సోదరి షర్మిల చెప్పారు.

మేకపాటి

మేకపాటి

జగన్ పైన ఎల్లో మీడియా బురద జల్లడమే పనిగా పెట్టుకుందని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. జగన్‌ను ఇరుకులో పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం విభజన బిల్లును తీసుకొచ్చిందన్నారు.

ఉమ్మారెడ్డి

ఉమ్మారెడ్డి

కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీలో మాట్లాడుతున్న పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.

కొణతాల

కొణతాల

కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీలో మాట్లాడుతున్న పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ దృశ్యం.

English summary
YS SHarmila, who has reportedly distanced herself from prarty activities due to differences with YS Jagan, ws at the centre of attraction at the plenary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X