హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త పంథా: గవర్నర్‌తో చేయి కలిపిన కేసీఆర్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొత్త పంథాలో తెలంగాణ బడ్జెట్ ఉండాలని, జమా ఖర్చులకే దానిని పరిమితం చేయవద్దని, ప్రభుత్వ విధానాలను ఆవిష్కరించాలని, ఐదేళ్లకు కార్యాచరణ ఉండాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు మేలు జరగాలని ప్రభుత్వ కార్యదర్శులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం దిశానిర్దేశనం చేశారు.

కాగా, గవర్నర్ నరసింహన్‌తో కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ భేటీ అయ్యారు. బడ్జెట్ రూపొందించడానికి మరికొంత వ్యవధి పట్టే అవకాశం ఉండటంతో బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 10వ తేదీ నుంచి కాకుండా కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని గవర్నర్ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకు వచ్చి ఉంటారని అంటున్నారు. అలాగే ఐఏఎస్ అధికారుల కేటాయింపు, విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ళలో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల విభజనపై గవర్నర్‌తో చర్చించారని సమాచారం.

అలాగే విద్యుత్ సమస్య, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ చివరివారంలో లేదా అక్టోబర్ మొదటివారంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఉప ఎన్నికలు ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్

కేసీఆర్

కొత్త పంథాలో తెలంగాణ బడ్జెట్ ఉండాలని, జమా ఖర్చులకే దానిని పరిమితం చేయవద్దని, ప్రభుత్వ విధానాలను ఆవిష్కరించాలని, ఐదేళ్లకు కార్యాచరణ ఉండాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు మేలు జరగాలని ప్రభుత్వ కార్యదర్శులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం దిశానిర్దేశనం చేశారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ చివరివారంలో లేదా అక్టోబర్ మొదటివారంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

కేసీఆర్

కేసీఆర్

గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ భేటీ అయ్యారు.

కేసీఆర్

కేసీఆర్

బడ్జెట్ రూపొందించడానికి మరికొంత వ్యవధి పట్టే అవకాశం ఉండటంతో బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 10వ తేదీ నుంచి కాకుండా కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని గవర్నర్ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకు వచ్చి ఉంటారని అంటున్నారు.

కడియం

కడియం

గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో చేయి కలుపుతున్న ఎంపీ కడియం.

కేసీఆర్

కేసీఆర్

అలాగే ఐఏఎస్ అధికారుల కేటాయింపు, విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ళలో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల విభజనపై గవర్నర్‌తో చర్చించారని సమాచారం.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కాలేజీ ఫౌండేషన్ కలిసింది. ఈ సందర్భంగా కాళోజీ జయంత్యుత్సవాలను అధికారికంగా జరుపుతామని చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కాలేజీ ఫౌండేషన్ కలిసింది. వరంగల్‌లో భారీ కళా, సాంస్కృతిక కేంద్రం నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కాలేజీ ఫౌండేషన్ కలిసింది. పాఠ్య పుస్తకాల్లో కాళోజీ చరిత్రను పెడతామని చెప్పారు.

English summary

 Photos of Telangana CM KCR meets Governor Narasimhan at Raj Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X