ఫస్ట్ సిఎం: కవిత జోష్, హరీష్ పాదాభివందనం(పిక్చర్స్)

హైదరాబాద్: దేశంలోని 29వ రాష్ట్రం తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. తన మంత్రివర్గాన్ని ఆయన 9 మందితో ఏర్పాటు చేసుకున్నారు. 9 మంది మంత్రులు సోమవారం ఉదయం కెసిఆర్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన శాసనసభ్యులకు, తనకు సన్నిహితులైన నేతలకు ఆయన మంత్రి పదవులు ఇచ్చారు. ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీ గానీ నాయని నర్సింహారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయనను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా పంపించే అవకాశం ఉంది.

మంత్రి విస్తరణ త్వరలో ఉంటుందని చెబుతున్నారు. విస్తరణలో మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు ఎస్టీలకు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ఆయన తన మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది.

గవర్నర్ దంపతులతో కెసిఆర్

గవర్నర్ దంపతులతో కెసిఆర్

ప్రమాణ స్వీకారం చేయడానికి కెసిఆర్ సోమవారం ఉదయం రాజభవన్‌కు చేరుకున్నారు. గవర్నర్ దంపతులతో ఆయన ఇలా కనిపించారు.

కెసిఆర్ ప్రమాణ స్వీకారం

కెసిఆర్ ప్రమాణ స్వీకారం

గవర్నర్ నరసింహన్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌తో సోమవారం ఉదయం ప్రమాణం చేయించారు.

మొహమూద్ అలీ...

మొహమూద్ అలీ...

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మొహమూద్ అలీ మంత్రిగా ప్రమాణం చేశారు. అయన ఎమ్మెల్సీ. మైనారిటీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కింది.

టి. రాజయ్య మంత్రిగా..

టి. రాజయ్య మంత్రిగా..

వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యుడు టి. రాజయ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

కిషన్ రెడ్డి ఇలా...

కిషన్ రెడ్డి ఇలా...

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఆయన ఇలా కనిపించారు.

నాయని నర్సింహా రెడ్డి మంత్రిగా..

నాయని నర్సింహా రెడ్డి మంత్రిగా..

ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీ గానీ కానటువంటి తెరాస నాయకుడు నాయని నర్సింహారెడ్డికి కెసిఆర్ మంత్రి పదవి ఇచ్చారు.

ఈటెల రాజేందర్ ప్రమాణం

ఈటెల రాజేందర్ ప్రమాణం

2009 నుంచి ఉమ్మడి రాష్ట్ర శానససభలో తెరాస శాసనసభా పక్ష నేతగా ఉంటూ వచ్చిన ఈటెల రాజేందర్ మంత్రిగా ప్రమాణం చేశారు.

పోచారం శ్రీనివాస రెడ్డి ప్రమాణం

పోచారం శ్రీనివాస రెడ్డి ప్రమాణం

నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాస రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయన టిడిపి నుంచి వచ్చి తెరాసలో చేరారు. ఉప ఎన్నికల్లో కూడా ఇంతకు ముందు విజయం సాధించారు.

హరీష్ రావు ప్రమాణం

హరీష్ రావు ప్రమాణం

సిద్ధిపేట శాసనసభ్యుడు టి. హరీష్ రావు మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన కెసిఆర్‌కు పాదాభివందనం చేశారు.

పద్మారావు మంత్రిగా...

పద్మారావు మంత్రిగా...

సనత్ నగర్ శానససభ్యుడు పద్మారావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మొదటి నుంచీ తెరాసలో ఉంటూ వస్తున్నారు.

మహేందర్ రెడ్డి ప్రమాణం

మహేందర్ రెడ్డి ప్రమాణం

రంగారెడ్డి జిల్లాకు చెందిన శాసనసభ్యుడు పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

కెటి రామారావు ప్రమాణం

కెటి రామారావు ప్రమాణం

కెసిఆర్ తనయుడు, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటి రామారావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

జోగు రామన్న ప్రమాణం

జోగు రామన్న ప్రమాణం

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జోగు రామన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

జగదీశ్వర్ రెడ్డి ప్రమాణం

జగదీశ్వర్ రెడ్డి ప్రమాణం

తొలిసారి శాసనసభకు ఎన్నికైన జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

నాదెండ్ల మనోహర్ హాజరు..

నాదెండ్ల మనోహర్ హాజరు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కెసిఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

కవిత కుటుంబ సభ్యులు

కవిత కుటుంబ సభ్యులు

నిజామాబాద్ లోకసభకు ఎన్నికైన కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కెసిఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+