ఎమ్మెల్యే నిధులన్నీ విద్యుత్‌కే: గజ్వెల్‌లో కేసీఆర్ (పిక్చర్స్)

మెదక్: గజ్వెల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండేళ్లలో 24 గంటలూ నిరంత విద్యుత్తు సరఫరా చేస్తామన్నారు.

ఆదివారం మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవల్లి సమీపంలోని సీఎం సొంత వ్యవసాయ క్షేత్రం ఆవరణలో నిర్వహించారు.

ప్రస్తుతం తీవ్రంగా ఉన్న విద్యుత్తు సంక్షోభాన్ని రెండేళ్లలో అధిగమిస్తామన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో విద్యుత్తు రంగాన్ని పటిష్ఠపరుస్తామన్నారు.

 గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వెల్‌లో కేసీఆర్

నియోజకవర్గంలో వేలాడే విద్యుత్తు తీగలు సరిచేసేందుకు, వంగిన, తుప్పుపట్టిన విద్యుత్తు స్తంభాలను తొలగించేందుకు రూ.10 కోట్లు కేటాయించి పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఏడీఈ, ఏఈని నియమించినట్లు కేసీఆర్ తెలిపారు.

 గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వెల్‌లో కేసీఆర్

తన ఎమ్మెల్యే కోటా నిధులన్నీ విద్యుత్తు శాఖకే ఇస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. అన్ని గ్రామ పంచాయతీలలో వీదిధీపాల కోసం ప్రత్యేకలైన్‌ నిర్మించి విద్యుత్తు వినియోగాన్ని ఆదా చేస్తామన్నారు.

 గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వెల్‌లో కేసీఆర్

గత ప్రభుత్వాల హయాంలోనే తెలంగాణలో అన్ని రకాల రోడ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల నిర్మాణమే ధ్యేయమన్నారు.

 గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వేల్‌ నియోజకవర్గంలో రూ.151 కోట్లతో పంచాయతీరాజ్‌ అధీనంలోని సింగిల్‌ రోడ్లను, 260 కోట్లతో రోడ్లు, భవనాల శాఖ అధీనంలోని సింగిల్‌ రోడ్లను డబుల్‌ రోడ్లుగా విస్తరిస్తామన్నారు.

 గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వెల్‌లో కేసీఆర్

మరో రూ.86 కోట్లతో 72 రోడ్లకు మరమ్మతులు చేపడతామన్నారు. వర్గంలో అన్ని మండల కేంద్రాలలో డబుల్‌ రోడ్లు, డివైడర్లు నిర్మించి బట్టర్‌ ఫ్లై లైట్లు ఏర్పాటుకు రూ.1.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

 గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వేల్‌ చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి రూ.90 కోట్లు మంజూరు చేశామన్నారు. కాకతీయ మిషన్‌ కింద నియోజకవర్గంలో రూ.250 కోట్లతో 606 చెరువులను పునరుద్ధరిస్తామన్నారు.

 గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వెల్‌లో కేసీఆర్

రూ.5వేల కోట్లతో పాములపర్తి - మర్కుక్‌ రిజర్వాయర్‌ నిర్మించి ప్రాణహిత-చేవెళ్ల నీటితో నియోజకవర్గంలో లక్షా 40వేల ఎకరాలకు సాగునీరందిస్తామని కేసీఆర్‌ చెప్పారు.

 గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వెల్‌లో కేసీఆర్

రెవెన్యూ, పోలీస్‌, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేసి శిఖం కబ్జాలను అరికట్టాలని సూచించారు. జిల్లాలో రూ.250 కోట్లతో వేయి ఎకరాలలో గ్రీన్‌హౌస్‌ సాగును ప్రోత్సహిస్తామన్నారు.

 గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వెల్‌లో కేసీఆర్

నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో బస్‌షెల్టర్‌, వైకుంఠధామం(స్మశానవాటిక) ఏర్పాటు చేస్తామన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో కంపెనీల ఏర్పాటుకు ఐటీసీ, కోకోకోలా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్నారు.

 గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వెల్‌లో కేసీఆర్

సీమాంధ్ర పాలనలో వెనక్కివెళ్లిన వానలు తెలంగాణకు వాపసు రావాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

 గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వెల్‌లో కేసీఆర్

పర్యావరణ పరిరక్షణతోపాటు వర్షాలకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. త్వరలోనే తాను నియోజకవర్గంలో పర్యటిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

 గజ్వెల్‌లో కేసీఆర్

గజ్వెల్‌లో కేసీఆర్

సమావేశంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, నీటిపారుదల మంత్రి హరీ‌శ్ రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+