ఢిల్లీలో నరసింహన్, హైద్రాబాద్‌లో సిఎస్ బిజీ (పిక్చర్స్)

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. పలువురు నేతలను కలుస్తున్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరిస్తున్నారు. గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలుస్తారు. ఆయన సాయంత్రం హైదరాబాద్ రానున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితితో సంప్రదింపుల కోసం కాంగ్రెసు పార్టీ ఓ కమిటీని వేసింది. విలీనం కెసిఆర్ ఇష్టమని చెబుతున్న కాంగ్రెసు, పొత్తు కోసం తెరాసలాగే ఓ కమిటీని వేసింది.

మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ మహంతి బుధవారం హైదరాబాదులో రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన కమిటీలతో భేటీ అయ్యారు. మార్చి 30వ తేదీలోగా పూర్తి నివేదికలు ఇవ్వాలని, ఉద్యోగులు వివరాలు ఇవ్వకుంటే జీతాలు ఆపేస్తామని హెచ్చరించారు.

దిగ్విజయ్

దిగ్విజయ్

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం ఢిల్లీలో మాట్లాడారు. విలీనంపై గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావే చెప్పారని, ఆయనిష్టమన్నారు.

నరసింహన్

నరసింహన్

భారీ వర్షాలు, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన వారికి సాయం అందించాలంటూ గవర్నర్ నరసింహన్ ఢిల్లీ నుండి ఆదేశించారు. అధికారిక పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్న నరసింహన్ బుధవారం హైదరాబాద్‌లో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతితో ఫోన్‌లో మాట్లాడారు.

మహంతికి నరసింహన్

మహంతికి నరసింహన్

పంటలకు జరిగిన నష్టంతో పాటు ఇతరత్రా జరిగిన నష్టం వివరాలను యుద్ధప్రాతిపదికన సేకరించాలని ఆదేశించారు. నిబంధనల మేరకు సహాయక చర్యలు చేపట్టాలని గవర్నర్ సూచించారు.

చిదంబరంతో భేటీ అనంతరం...

చిదంబరంతో భేటీ అనంతరం...

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ బుధవారం ఆర్థిక మంత్రి చిదంబరంతో భేటీ అయిన అనంతరం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి బయటకు వస్తున్నదృశ్యం.

కమిటీలతో సిఎస్ భేటీ అయ్యారు

కమిటీలతో సిఎస్ భేటీ అయ్యారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పైన రాష్ట్ర సచివాలయంలో ప్రధాన కార్యదర్శి మహంతి బుధవారం సమీక్ష నిర్వహించారు.

వివరాలు ఇవ్వాలని ఆదేశం

వివరాలు ఇవ్వాలని ఆదేశం

రాష్ట్ర విభజనపై ఏర్పాటు అయిన 14 కమిటీలతో మహంతి సమావేశమయ్యారు. ఆస్తులు, అఫ్పులు, దస్త్రాలు, ఉద్యోగుల పంపిణీపై మార్చి నెలాఖరు నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఐఏఎస్‌ల పంపిణీ కోసం

ఐఏఎస్‌ల పంపిణీ కోసం

ఐఏఎస్‌ల పంపిణీ కోసం శామ్యూల్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. జూన్ రెండో తేది నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పేరిట వెబ్ సైట్ రూపకల్పనకు నిర్ణయం తీసుకున్నారు.

ఆదేశాలు

ఆదేశాలు

ఇటీవల ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలను గవర్నర్ నరసింహన్‌కు పంపించనున్నారు. పద్నాలుగు కమిటీల పని తీరుపై మహంతి సమీక్ష జరిపారు.

మహంతీ

మహంతీ

మార్చి 30వ తేదీ లోపు నివేదికలు, సమాచారం పూర్తిగా ఇవ్వాలని లేదంటే ఉద్యోగుల జీతాలు నిలిపివేయాల్సి ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది.

సిఎస్ మహంతీ

సిఎస్ మహంతీ

15వ తేదీకల్లా ఉద్యోగులు వ్యక్తిగత సమాచారం ఇవ్వాలన్నారు. కాగా, గురువారం కమల్ నాథ్ కమిటీ రాష్ట్రానికి రానున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+