టీ తాగుతూ ఎన్టీఆర్, రూ.10 అడిగిన బాబు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రాలను వారు తిలకించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. అవినీతిపరులు, దొంగలు, అసమర్థ పాలకులపై ఎన్టీఆర్ స్ఫూర్తితో యువత బొబ్బిలి పులులు, కొండవీటి సింహాలై పోరాడి వచ్చే ఎన్నికల్లో వారిని మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర పునర్నిర్మాణా నికి అందరం కలిసి పని చేద్దామని, సైనికుల్లా పని చేసి టిడిపిని గెలిపిద్దామన్నారు. వచ్చే మే 28న ఎన్టీఆర్ జయంతిని మన ప్రభుత్వంలో నిర్వహిద్దామన్నారు. తమపై నమ్మకం ఉంటే ప్రతి మహిళ ఆలిండియా రేడియోలా మారి, ప్రచారం చేయాలని కోరారు. టిడిపి హయాంలో అమెరికా అధ్యక్షుడు వంటివారు కూడా హైదరాబాద్ వచ్చి వెళ్ళేవారని, ఇప్పుడు స్మగ్లర్లు, మాఫియా డాన్లు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
టిడిపి హయాంలో రౌడీలు, కబ్జా ముఠాలు రాష్ట్రంనుంచి పారిపోతే కాంగ్రెస్ హయాంలో సీఎంల కుటుంబసభ్యులే కబ్జాలకు పాల్పడే దుస్థితి వచ్చిందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయడంతోపాటు పేదలను పైకి తేవడానికి వందల సంఖ్యలో కళాశాలలు పెట్టి ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత టిడిపిదేనని చెప్పారు. దీనిపై చర్చకు సిద్దమని సవాల్ చేశారు.

ఎన్టీఆర్
స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయనకు చెందిన పలు చిత్రాలను ప్రదర్శించారు.

ఎన్టీఆర్
స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయనకు చెందిన పలు చిత్రాలను ప్రదర్శించారు. చంద్రబాబు దంపతులు తిలకించారు.

ఎన్టీఆర్
స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయనకు చెందిన పలు చిత్రాలను ప్రదర్శించారు.

ఎన్టీఆర్
స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయనకు చెందిన పలు చిత్రాలను ప్రదర్శించారు. చంద్రబాబు దంపతులు తిలకించారు.

ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రాలను వారు తిలకించారు.

ఎన్టీఆర్
అవినీతిపరులు, దొంగలు, అసమర్థ పాలకులపై ఎన్టీఆర్ స్ఫూర్తితో యువత బొబ్బిలి పులులు, కొండవీటి సింహాలై పోరాడి వచ్చే ఎన్నికల్లో వారిని మట్టి కరిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్
వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సహకారంతో జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ రక్తనిధిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.

ఎన్టీఆర్
ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, కిమ్స్ ఆస్పత్రులకు ఎన్టీఆర్ రక్తనిధి నుంచి ఉచితంగా రక్తాన్ని ఇవ్వడానికి ఈ సందర్భంగా ఒప్పందం కుదిరింది.

ఎన్టీఆర్
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు ప్రజోపయోగ కార్యక్ర మాలు నిర్వహించారు. తిరుమలేశుడు చాలా శక్తిగల దేవుడని, ఆయన దగ్గర తప్పుడు పనులు చేస్తే మసవుతారని చంద్రబాబు హెచ్చరించారు.

ఎన్టీఆర్
టిడిపి హయాంలో ముఖ్యమంత్రులుగా ఉండి క్యూలో వెళ్తే ఇప్పుడు దావూద్ ఇబ్ర హీం అనుచరులు, స్మగ్లర్లు మహద్వారం నుంచి వెళ్తున్నారని, తప్పుడు వ్యవహారాలను దేవుడు చూస్తున్నాడని గ్రహిస్తే మంచిదని బాబు అన్నారు.

ఎన్టీఆర్
అటవీ అధికారులను ఎర్ర చందనం స్మగ్లర్లు చంపినా ప్రభుత్వంలో కదలిక రాలేదని, ఆ అధికారుల కుటుంబాలకు తాను తలా రూ.లక్ష విరాళం ఇచ్చానని చెప్పారు.

ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రానికు పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న చంద్రబాబు.

ఎన్టీఆర్
నల్లగొండ జిల్లాలో అత్యాచారానికి గురైన 12మంది బాలికలకు తలా రూ.25 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను చంద్రబాబు తన సతీమణి భువనేవ్వరితో కలసి వారి తల్లిదండ్రులకు అందచేశారు.

ఎన్టీఆర్
రానున్నది కురుక్షేత్ర సమరమని, మంచికి చెడుకు, ధర్మానికి అధర్మానికి మధ్య పోటీ అని, పాండవులు ఐదుగురే అయినా ధర్మమే గెలిచిందని, టిడిపి దగ్గర డబ్బుల్లేవని, నీతి ఉందని, ప్రజలు నీతిని, న్యాయాన్ని ఆదరిస్తారన్న నమ్మకం ఉందని, వారు సహకరించాలని, ఎన్నికల్లో ఓటివ్వాలని చంద్రబాబు ప్రజలను కోరారు. దాంతో పాటు ఓ పది నోటివ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications