పవన్ కోసం ఆరాటం, బాలకృష్ణేనని లోకేష్ (పిక్చర్స్)
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణలు ఆదివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు.
వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన, కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.
దేశంలో ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయడు అధికారం చేపట్టడం తథ్యమని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు బాలకృష్ణ మాత్రమేనని, నట సార్వభౌముడు ఎన్టీఆర్ అని, రాజకీయాల్లో లెజెండ్ చంద్రబాబు మాత్రమేనని స్పష్టం చేశారు. ఓ చేప పిట్టకథ కూడా చెప్పి అలరించారు.

పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పవ్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమాన నటుడిని కెమెరాల్లో బందిస్తున్న దృశ్యం.

జెపి
లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ చిత్తూరు జిల్లాలో తమ పార్టీ అభ్యర్థి తరఫున జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆయన తెలంగాణలోని మల్కాజిగిరి నియోజకవర్గం నుండి బరిలో నిలిచారు.

నారా లోకేష్
రాష్ట్రానికి విజన్ 20-20 కావాలో 420 కావాలో ప్రజలే నిర్ణయించాలని లోకేష్ సూచించారు. ఎన్నికల తర్వాత 15 రోజుల్లో జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు.

నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పేద, మధ్యతరగతి ప్రజల కోసం రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్య సేవలు పొందడం కోసం ఎన్టీఆర్ ఆరోగ్య కార్డులు ప్రవేశ పెడతామన్నారు. నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు.












Click it and Unblock the Notifications