స్త్రీతో లింక్‌పై భార్య ప్రశ్న,ఆత్మహత్య: అరెస్ట్ (పిక్చర్స్)
విశాఖపట్నం: ఆడపిల్లలు పుట్టారని భర్త, కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఇద్దరి కుమార్తెలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న కేసులో భర్త, బావ, అత్తను ద్వారకా జోన్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మహేష్ వివరాలు తెలిపారు. హైదరాబాదుకు చెందిన అర్చనకు విశాఖలో ఉంటున్న సతీష్ కళ్యాణ్ చక్రవర్తికి 2011లో వివాహం అయింది. ఆరు నెలలు అన్యోన్యంగా జీవనం సాగించారు.
అత్త, బావ కుటుంబంతో కలిసి ఉమ్మడిగా మధురానగర్‌లో ఒక అపార్టుమెంటులో ఉండేవారు. కుమార్తె పుట్టగా పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు కూడా భర్త వెళ్లలేదు. ఆ తర్వాత కుమార్తెతో పాటు వచ్చిన అర్చనకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. భర్త మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. మరోసారి కూడా అర్చన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అత్తవారింటికి వచ్చినప్పటి నుండి వేధింపులు మొదలయ్యాయి. చక్రవర్తికి మరో స్ర్తీతో సంబంధం ఉండటంతో అర్చన ప్రశ్నించేది.
దీంతో ఆడపిల్లలు పుట్టారని కొట్టేవాడు. అత్తింటి వేధింపులు భరించలేక అర్చన ఇద్దరు పిల్లలకు పాలల్లో హెయిర్ రిమూవర్ కలిపి తాగించింది. అనంతరం అర్చన తాను ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలు, భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన అర్చన భర్త సతీష్ కళ్యాణ చక్రవర్తి, బావ నాగ విశ్వనాథం, అత్త గంగాభవానిపై మృతురాలి సోదరుడు ఆనంద్ కుమార్ ద్వారకా జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ మహేష్ ఆధ్వర్యంలో సీఐ నరసింహ రావు, ఎస్సై భాస్కర్ కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఆత్మహత్య
అర్చన అనే మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది.

చిన్నారితో అర్చన
హైదరాబాదుకు చెందిన అర్చనకు విశాఖలో ఉంటున్న సతీష్ కళ్యాణ్ చక్రవర్తికి 2011లో వివాహం అయింది. ఆరు నెలలు అన్యోన్యంగా జీవనం సాగించారు.

అర్చన
అర్చన అనే మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది.

అర్చన
అర్చన అనే మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను చంపి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది.

అర్చన
అర్చనతో కలిసి ఉమ్మడిగా మధురానగర్‌లో ఒక అపార్టుమెంటులో ఉండేవారు. కుమార్తె పుట్టగా పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకు కూడా భర్త వెళ్లలేదు. ఆ తర్వాత కుమార్తెతో పాటు వచ్చిన అర్చనకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి.

నిందితులు
ఇద్దరు పిల్లలు, భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన అర్చన భర్త సతీష్ కళ్యాణ చక్రవర్తి, బావ నాగ విశ్వనాథం, అత్త గంగాభవానిపై మృతురాలి సోదరుడు ఆనంద్ కుమార్ ద్వారకా జోన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

నిందితులు
ఏసీపీ మహేష్ ఆధ్వర్యంలో సీఐ నరసింహ రావు, ఎస్సై భాస్కర్ కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.












Click it and Unblock the Notifications