హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరవీరులకు కిరణ్ సలామ్: 500 వితరణ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్‌లు నివాళులు అర్పించారు. హైదరాబాదులోని గోషామహల్ పోలీసు స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు. సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. రాష్ట్రంలో 599 మంది పోలీసులు అమరవీరులయ్యారని, ఉగ్రవాదుల చేతిలో ముగ్గురు పోలీసులు అమరులయ్యారని ఆయన తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు ఇతర రాష్ట్రాలతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మూడేళ్ల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరుగుతోందని, గత మూడేళ్లలో ఇరవై ఎనిమిది వేల మంది కానిస్టేబుళ్లను రిక్రూట్ చేశామని తెలిపారు. పోలీసుల ఆరోగ్య పరిరక్షణ, క్వార్టర్స్ కోసం నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. డిజిపి ప్రసాద రావు కూడా నివాళులు అర్పించారు.

పోలీసు 1

పోలీసు 1

అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా స్థూపం వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పుష్పగుచ్చం పెడుతున్న దృశ్యం.

పోలీసు 2

పోలీసు 2

అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా స్థూపం వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించి వస్తు్నన దృశ్యం.

పోలీసు 3

పోలీసు 3

పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో వందనం సమర్పిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి.

పోలీసు 4

పోలీసు 4

అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా 'అమరులు వారు' అనే పుస్తకంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

పోలీసు 5

పోలీసు 5

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఐదువందల రూపాయలను బాక్సులో వేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.

పోలీసు 6

పోలీసు 6

పోలీసులు రెండు నిమిషాల పాటు తుపాకీని దించి అమరవీరుల కుటుంబాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

పోలీసు 7

పోలీసు 7

పోలీసులు 2 నిమిషాల పాటు తుపాకీని దించి అమరవీరుల కుటుంబాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

పోలీసు 8

పోలీసు 8

సమాజంలో పోలీసుల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. రాష్ట్రంలో 599 మంది పోలీసులు అమరవీరులయ్యారని, ఉగ్రవాదుల చేతిలో ముగ్గురు పోలీసులు అమరులయ్యారని ముఖ్యమంత్రి తెలిపారు.

పోలీసు 9

పోలీసు 9

పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, డిజిపి ప్రసాద రావు తదితరులు నివాళులు అర్పించారు.

పోలీసు 10

పోలీసు 10

పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, డిజిపి ప్రసాద రావు తదితరులు నివాళులు అర్పించారు.

పోలీసు 11

పోలీసు 11

అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినం సందర్భంగా హైదరాబాదులోని గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో కార్యక్రమం నిర్వహించారు.

English summary
CM Kiran kumar Reddy laying wreath on police martyrs memorial on the occasion of police commemoration day at Gousha Mahal Police Stadium on 21st October. policeman Gun down for two minutes to observe silent to pay homage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X