ఏపీ రాజధాని: బిల్డ్ ఆంధ్రా రఘురాంరాజన్ కితాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి బ్యాంకింక్ రంగం ద్వారా తగిన ఆర్థిక మద్దతుతో పాటు, నిధుల సమీకరణకు అవసరమైన సూచనలను చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను బుధవారం కోరారు. ఆర్బీఐ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు రఘురామ్ రాజన్ హైదరాబాద్ వచ్చారు.య సచివాలయంలో యనమలతో భేటీ అయ్యారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవాల్సి ఉన్నా, తుఫాను కారణంగా విశాఖలో ఉండిపోవడంతో యనమలతో సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేక ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయనున్నామని, దానికి అవసరమైన సూచనలతో పాటు సాయం చేయాలని ఆర్బీఐ గవర్నర్‌ను కోరగా.. నిధుల కోసం మున్సిపల్ బాండ్లు విడుదల చేయవచ్చని సూచించారన్నారు.
కాగా, ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్లను అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ బాండ్లను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి బిల్డ్ ఆంధ్రా బాండ్లుగా నామకరణం చేస్తోంది. ఈ ప్రాజెక్టు రిపోర్టు నివేదికలను రిజర్వ్ బ్యాంకు బృందానికి కూడా నివేదించింది. బాండ్లకు రిజర్వ్ బ్యాంకు అనుమతి అవసరం కావడంతో ఈ కొత్త ప్రతిపాదనలను ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు సమర్పించినట్లు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు.

'బిల్డ్ ఆంధ్రా'
కొత్త రాష్ట్రం ఏర్పడిన అనంతరం నగరాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి చర్యలు ప్రారంభించింది.

'బిల్డ్ ఆంధ్రా'
ఇందులో భాగంగానే రాజధాని నగరంతోపాటు, రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు బిల్డ్ ఆంధ్ర పేరుతో ప్రాజెక్టును సిద్ధం చేస్తోంది.

'బిల్డ్ ఆంధ్రా'
మున్సిపాల్టీల్లో అభివృద్ధికి బాండ్లను అందించడం, తద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధికి ఉపయోగించడం, పెరిగే విలువతో సమీకరించే నిధులను తిరిగి బాండ్లకు చెల్లించడంపై దృష్టి పెడుతోంది.

'బిల్డ్ ఆంధ్రా'
రాష్ట్ర రాజధానిలో సచివాలయం, శాసనసభ, ఇతర ప్రభుత్వ కట్టడాల నిర్మాణానికి కొంత మేరకు కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశాలు ఉండగా, మరికొంత రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.

'బిల్డ్ ఆంధ్రా'
అయితే నగరాల్లో రోడ్లు, పచ్చదనం, సామాజిక అవసరాలు వంటి మౌలికాభివృద్ధి కార్యక్రమాలకు మాత్రం నిధుల కొరత ఉంటుంది. దీనికి అవసరమైన నిధులను బాండ్లతోనే సమకూర్చుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

'బిల్డ్ ఆంధ్రా'
మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలోనే బాండ్లను తయారుచేసి, వాటిని అమ్మడం, వచ్చిన సొమ్మును అభివృద్ధికి ఖర్చు చేయాలని భావిస్తోంది.

'బిల్డ్ ఆంధ్రా'
ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగిన తరువాత సాధారణంగానే మార్కెట్ విలువ పెరిగి, పన్నుల వసూళ్లు కూడా పెరుగుతాయని, ఆదాయం వస్తుందని, దానితో బాండ్లకు వడ్డీతో చెల్లింపులు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

'బిల్డ్ ఆంధ్రా'
దీనిపై ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, త్వరలోనే పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని వారు చెబుతున్నారు.
ఈ ఆలోచనలనే రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఇతర అధికారులు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ వద్ద ఉంచారు.

'బిల్డ్ ఆంధ్రా'
దీనిని పరిశీలించిన రాజన్ సంతృప్తి వ్యక్తం చేసి, మొత్తం ప్రతిపాదనలను తమకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications