వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖవాసులు తేరుకోకముందే వర్ష బీభత్సం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: విశాఖ నగరంలో గురువారం సాయంత్రం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలులకు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, పెద్దపెద్ద చెట్లు నేలకూలాయి. హోర్డింగులు పడిపోయాయి. పలు కాలనీల్లో చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

కేన్సర్ ఆస్పత్రి వద్ద చెట్లకొమ్మలు విరిగి పార్కింగ్ చేసిన బైకులపై పడ్డాయి. రైతుబజార్ వద్ద చెట్లు, హోర్డింగులు కూలిపోవడంతో ప్రజలు బెంబేలెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం మండపం నుంచి ఉషోదయ జంక్షన్‌కు వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభం కూలిపోయింది.

జాతీయ రహదారిపై సత్యం జంక్షన్ నుంచి హనుమంతవాక వరకూ రహదారిపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్షం, చెట్లు నేలకూలడం, విద్యుత్ స్థంబాలు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి.

 విశాఖ

విశాఖ

విశాఖ నగరంలో గురువారం వీచిన ఈదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం వాటిల్లింది. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈపిడిసిఎల్ విశాఖ సర్కిల్ పరిధిలో సుమారు చాలా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

విశాఖ

విశాఖ

నగరంలోని సాగర్ నగర్, జోడుగుళ్ల పాలెం, వెంకోజి పాలెం, మద్దిల పాలెం, పద్మనాభం, చిట్టి వలస, పోతినమల్లయ్య పాలెం, ఆదిభట్ల నగర్, సీతమ్మ ధార వంటి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో నిలిచిపోయింది.

విశాఖ

విశాఖ

సాగర్ నగర్, చిట్టివలస, పద్మనాభం, హెచ్‌బీ కాలనీ, మద్దిలపాలెం, పెదవాల్తేరు, ఎంవీపీకాలనీ వంటి ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై భారీ చెట్లు పడిపోవడంతో అవి నేలకొరిగిపోయాయి. ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో భారీ ప్రమాదం జరగలేదు.

 విశాఖ

విశాఖ

విశాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సిహెచ్ సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో ఆపరేషన్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.

 విశాఖ

విశాఖ

విద్యుత్ స్తంభాలు పడిపోయిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించడానికి అవకాశాలున్న ప్రాంతాల్లో కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు.

 విశాఖ

విశాఖ

మరికొన్ని ప్రాంతాల్లో తీగలు వేలాడిపోవడంతో వాటిని సరిచేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి కూడా ఎమర్జెన్సీ సేవలకు సిబ్బందిని తీసుకువచ్చారు.

విశాఖ

విశాఖ

కొన్ని ప్రాంతాలకు సమీపంలోని సబ్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరాను ప్రత్యామ్నయంగా సాగించేందుకు చర్యలు చేపట్టారు. ఫీడర్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు పూర్తి చేసేందుకు కొంత సమయం పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.

విశాఖ

విశాఖ

నగరంలోని జోన్-1, జోన్-2 పరిధిలోని అనేక ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ సాగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

 విశాఖ

విశాఖ

ప్రధాన రహదారుల్లో సైతౖం చిమ్మచీకటి నెలకొంది. కొద్ది నిమిషాలు మాత్రమే వీచిన గాలులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 విశాఖ

విశాఖ

బుధవారం రాత్రి భూకంపం, గురువారం ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విశాఖలోని అత్యధిక ప్రాంతాల్లో ప్రజలు నిద్రలేమికి గురయ్యారు.

విశాఖ

విశాఖ

భూ ప్రకంపనల భయం నుండి తేరుకోకముందే సుడిగాలి విశాఖ నగర ప్రజలను భయకంపితులను చేసింది. గురువారం సాయంత్రం వీచిన సుడిగాలి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది.

విశాఖ

విశాఖ

భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. అత్యధిక చెట్లు, విద్యుత్ లైన్లపై పడిపోవడంతో విద్యుత్తు వ్యవస్థ చాలా ప్రాంతాల్లో దెబ్బ తిన్నది. విశాఖతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు అంధకారం నెలకొంది.

విశాఖ

విశాఖ

విశాఖ నగరంలో గురువారం సాయంత్రం పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలులకు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, పెద్దపెద్ద చెట్లు నేలకూలాయి.

విశాఖ

విశాఖ

విశాఖ నగరంలో హోర్డింగులు పడిపోయాయి. పలు కాలనీల్లో చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

విశాఖ

విశాఖ

కేన్సర్ ఆస్పత్రి వద్ద చెట్లకొమ్మలు విరిగి పార్కింగ్ చేసిన బైకులపై పడ్డాయి. రైతుబజార్ వద్ద చెట్లు, హోర్డింగులు కూలిపోవడంతో ప్రజలు బెంబేలెత్తారు.

విశాఖ

విశాఖ

విశాఖ నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం మండపం నుంచి ఉషోదయ జంక్షన్‌కు వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభం కూలిపోయింది.

విశాఖ

విశాఖ

జాతీయ రహదారిపై సత్యం జంక్షన్ నుంచి హనుమంతవాక వరకూ రహదారిపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

విశాఖ

విశాఖ

వర్షం, చెట్లు నేలకూలడం, విద్యుత్ స్థంబాలు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి.

English summary
Heavy rain in Vishaka city on Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X