గణేష్ సమైక్యం: భీముడు Vs అర్జునుడు!(పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాలో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. పలు జిల్లాలో వివిధ రూపాల్లో సమైక్యవాదులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాస్తారోకోలు, మానవహారాలు, లక్షగళ గర్జనతో తమ నిరసనను తెలియజేస్తున్నారు. పలు చోట్ల బంద్ కొనసాగుతోంది.

నెల్లూరు జిల్లాలో కావలిలలో సమైక్యాంధ్రకు మద్దతుగా కావలికేక పేరుతో సభ నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో లక్షగళ గర్జనను నిర్వహించారు. కర్నూలు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా మహళా గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

టిటిడిపి చైర్మన్ కనుమూరి బాపిరాజుకు సమైక్య సెగ తగిలింది. చెన్నై నుంచి రేణిగుంట రైల్వేస్టేషన్‌కు అర్థరాత్రి చేరుకున్న కనుమూరిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. వీరు అడ్డుకుంటారనే ముందస్తు సమాచారంతో రైల్వే స్టేషన్‌లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కనుమూరిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యవాదాన్ని కించపర్చాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే రాజీనామాల వల్ల ఉపయోగం లేదని కనుమూరి అన్నారు.

భీముడు వర్సెస్ అర్జునుడు!

భీముడు వర్సెస్ అర్జునుడు!

సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని నగర పాలక సంస్థ ఎదుట మహాభారతంలోని పాత్రల వేషధారణలో నిరసన తెలుపతున్న సమైక్యవాదులు. సోదరులైన భీముడికి, అర్జునుడికి గొడవ పెడుతున్నట్లుగా ప్రదర్శించారు.

వివిధ వేషధారణల్లో..

వివిధ వేషధారణల్లో..

సమైక్యాంధ్రకు మద్దతుగా వివిధ వేషధారణల్లో సమైక్యవాదులు నిరసన తెలియజేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిరసన తెలుపుతున్న దృశ్యం.

జై సమైక్యాంధ్ర

జై సమైక్యాంధ్ర

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎపి ట్రాన్సుకో, విద్యుత్ జెఏసి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేస్తున్న సమైక్యవాద ఉద్యోగులు.

న్యాయవాదులు

న్యాయవాదులు

ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న న్యాయవాదులు. సిడబ్ల్యూసి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

చవితిలో సమైక్యం

చవితిలో సమైక్యం

వినాయక చవితి సందర్భంగా విశాఖలో ఓ గణేష్ మండపాన్ని విభిన్నంగా అలంకరించారు. గణేష్ మండపం పైన జై సమైక్యాంధ్ర అంటూ రాశారు.

తెలంగాణ వద్దు సమైక్యమే ముద్దు

తెలంగాణ వద్దు సమైక్యమే ముద్దు

వినాయక చవితి సందర్భంగా విశాఖలో తెలంగాణ వద్దు... సమైక్యాంధ్ర ముద్దు.. కెసిఆర్ డౌన్ డౌన్ అని పట్టుకున్న గణపతి వాహనం మూషికం. వినాయకుడిని గాంధీజీ రూపంలో...

కెసిఆర్‌కు మూషికం గన్

కెసిఆర్‌కు మూషికం గన్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తుపాకీ గురిపెట్టిన వినాయకుడి వాహనం మూషికం దృశ్యం. సమైక్యాంధ్రకు మద్దతుగా ఇలా ప్రదర్శించారు.

వినాయకుడి చెంత

వినాయకుడి చెంత

కెసిఆర్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే రచ్చరచ్చ, విభజన వద్దు సమైక్యాంధ్ర ముద్దు అంటూ విశాఖలో ఓ వినాయక మండపంలో దృశ్యం.

సమైక్యాంధ్ర కావాలి

సమైక్యాంధ్ర కావాలి

విశాఖలోని వినాయక మండపంలో దేవడా సమైక్యాంధ్ర కావాలి, జై సమైక్యాంధ్ర అనే ప్లకార్డులు పట్టుకున్న సమైక్యవాదుల చిత్రాలతో....

వినాయక సమైక్యం

వినాయక సమైక్యం

విశాఖలో ఓ మండపంలో వినాయకుడు జై సమైక్యాంధ్ర అంటూ ప్లకార్డు పట్టుకున్న దృశ్యం. రెండు మూషికం చిత్రాలను పక్కన ఉంచి తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అనే ప్లకార్డులు పెట్టారు.

సైతాన్

సైతాన్

ప్రకాశం జిల్లా ఒంగోలులో కేంద్రమంత్రులు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతాన్ అంటూ వినూత్నంగా నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+