తాగి గన్‌తో కాల్చావ్: షర్మిల, జాగ్రత్త: బాలకృష్ణ(పిక్చర్స్)
అనంతపురం: ప్రజా సేవ చేయాలనే ఆలోచనతోనే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని హీరో, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ శనివారం అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ తెలుగుజాతి కోసం ఎనలేని కృషి చేశారన్నారు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు.
అదే బాటలో నడవాలని రాజకీయాల్లోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలు పెరిగిపోయాయన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారన్నారు. ఓటేసే ముందు ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలన్నారు. మాజీమంత్రి రఘువీరారెడ్డి రూ. 650 కోట్లతో శ్రీరామరెడ్డి తాగునీటి పథకాన్ని నాసిరకంగా చేయడంతో ప్రజలకు మేలు కలుగలేదన్నారు.
పెనుకొండ కొండను అభివృద్ధి పరుస్తానని గొప్పలు చెప్పుకున్న ఆదిశా చేసిందేమీ లేదన్నారు. కల్యాణదుర్గంలో అభివృద్ధి చేయకపోవడం వల్లే పెనుకొండ నుండి పోటీ చేస్తున్నారన్నారు. బాబు అధికారంలోకి వస్తే డ్వాక్రా, రైతుల రుణాల మాఫీ చేస్తామన్నారు. ఉచితంగా 9గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తామన్నారు.

బాలకృష్ణ
బిసిల అభివృద్ధికి బిసి సబ్‌ప్లాన్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాకు కృష్ణా జలాలు తెప్పించి ప్రతి గ్రామానికి తాగునీరు వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

షర్మిల
తాగిన మైకంలో అన్నం పెట్టిన నిర్మాతపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపి హత్య చేసేందుకు బాలకృష్ణ ప్రయత్నించారని షర్మిల ఆరోపించారు. తదనంతరం ఆసుపత్రి నుండి తన మానసిక పరిస్థితి సరిగా లేదంటూ సర్ట్ఫికెట్ తెచ్చుకుని పోలీసు కేసు లేకుండా బయటపడ్డాడన్నారు. మతిస్థిమితం లేని బాలకృష్ణకు ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉందా అంటూ షర్మిల ప్రశ్నించారు.

షర్మిల
హిందూపురంలో శనివారం జరిగిన రోడ్‌షోలో షర్మిల ప్రసంగించారు. ప్రజాసేవ అంటే ముఖానికి రంగు వేసుకుని, నెత్తిన విగ్గు పెట్టుకుని, మీసాలు మెలేస్తూ, తొడలు కొట్టినంత సులభం కాదన్నారు. పేదల కష్టనష్టాలు, ఆకలి దప్పికలు తెలిసిన వ్యక్తులు ప్రజల మధ్య నుండి పుట్టుకొస్తారన్నారు.

విజయమ్మ
సీమాంధ్రకు అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలన్నా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నా జగనే సమర్థుడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విశాఖ జిల్లాలో అన్నారు.












Click it and Unblock the Notifications