వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ కండువా కప్పారు, బాబును పొగిడారు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో రాజకీయ శక్తులు ఏకోన్ముఖంగా ముందుకు వెళ్లవలసి ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు.

పరకాల టీడీపీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన అనుచరులతో కలిసి తెలంగాణ భవన్‌లో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.

అందరం కలిసి పోరాడి తెలంగాణ సాధించుకున్నామని, సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు పోవాలన్నారు.

ధర్మారెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేసీఆర్

ధర్మారెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేసీఆర్

బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికే ధర్మారెడ్డి తెరాసలో చేరారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, పేదల సంక్షేమమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలిపారు.

ధర్మారెడ్డి, కేసీఆర్ పరస్పరం అభివాదం

ధర్మారెడ్డి, కేసీఆర్ పరస్పరం అభివాదం

టీడీపీ హయాంలో నెలకు 75రూపాయలు, కాంగ్రెస్ హయాంలో రెండు వందల రూపాయల పెన్షన్ చెల్లిస్తే, తెలంగాణలో ఇప్పుడు వెయ్యి రూపాయలు వృద్ధులు, వితంతువులకు, 15వందల రూపాయలు వికలాంగులకు చెల్లిస్తున్నట్టు చెప్పారు.

ధర్మారెడ్డికి పార్టీ కండువా కప్పుతున్న కేసీఆర్

ధర్మారెడ్డికి పార్టీ కండువా కప్పుతున్న కేసీఆర్

ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పథకాన్ని ప్రారంభించామని, పెన్షన్ల కోసం ఏటా నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.

ధర్మారెడ్డికి పార్టీ కండువా కప్పుతున్న కేసీఆర్

ధర్మారెడ్డికి పార్టీ కండువా కప్పుతున్న కేసీఆర్

తెరాస ప్రభుత్వాన్ని తిట్టేందుకు తెలంగాణ టీడీపీ నాయకులు ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారని తెరాసలో చేరిన ధర్మారెడ్డి ఆరోపించారు.

మాట్లాడుతున్న కేసీఆర్

మాట్లాడుతున్న కేసీఆర్

తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నా తెలంగాణ టీడీపీ నాయకులు మాత్రం ఆయన మోచేతి నీళ్లు తాగుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన విద్యుత్ వాటా ఇవ్వడం లేదని, తెలంగాణలో విద్యుత్ కష్టాలకు చంద్రబాబే కారణమని విమర్శించారు.

మాట్లాడుతున్న కేసీఆర్

మాట్లాడుతున్న కేసీఆర్

తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ అభివృద్ధిలో తాను పాలు పంచుకోవాలని, పరకాల నియోజక వర్గాన్ని అభివృద్ధి పరుచుకోవాలనే ఉద్దేశంతోనే టిఆర్‌ఎస్‌లో చేరినట్టు చెప్పారు.

మాట్లాడుతున్న కేసీఆర్

మాట్లాడుతున్న కేసీఆర్

కాగా, తెరాసలో చేరిన ధర్మారెడ్డి అనంతరం చంద్రబాబును పొగిడారు కూడా. తనకు చంద్రబాబు అన్నా, టీడీపీ అన్నా గౌరవమేనని, అయితే, తమ ప్రాంతమైన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసమే తాను తెరాసలో చేరుతున్నానని చెప్పారు. చంద్రబాబు తమ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిషలు కష్టపడుతున్నారని కితాబిచ్చారు.

ఎంత సొమ్ముకైనా ఇప్పుడు రీచార్జ్ చేసుకోండి, ఉచిత బహుమతులు పొందండి, త్వరపడండి!

English summary
TDP MLA Dharma Reddy, who had earlier announced his support to the TRS government in Telangana, formally joined the ruling party today.
 
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X