దూసుకెళ్లి టి 'అసెంబ్లీ' కట్టారు, కవిత హ్యాపీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణవాదులు విద్రోహ దినంగా పాటించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఐకాస, తెలంగాణ జాగృతి, ఇతర తెలంగాణవాదులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ నినాదాలతో గన్ పార్కు దద్దరిల్లింది.
కోదండరామ్, కవిత, విమలక్క తదితరులు గన్ పార్కు వద్ద నివాళులు అర్పించారు. కోదండరామ్ నల్ల జెండాను ఎగుర వేసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి, జగన్‌లు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేరని ఆయన అన్నారు. కిరణ్ కిరికిరి పెట్టినా, జగన్ ఎన్ని వేషాలు వేసినా తెలంగాణ సాధిస్తామన్నారు. ఇదే ఆఖరి విద్రోహ దినం అవుతుందని ఆకాంక్షించారు.
పార్లమెంటులో తెలంగాణ బిల్లును వెంటనే పెట్టాలని నిజామాబాదులో తెరాస ఎమ్మెల్యే కెటిఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు జైత్రయాత్రలు మానివేసి సీమాంధ్ర ముఖ్యమంత్రి పైన దండయాత్ర చేయాలని హితవు పలికారు. తెలంగాణలో సిఎం పదవి కోసం ఆరాటపడుతున్న నేతలు పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కృషి చేయాలన్నారు. జివోఎంకు నివేదిక ఇస్తామని చెప్పారు.

తెలంగాణ 1
తెలంగాణ అమరవీరుల స్థూపం అయిన గన్ పార్కు వద్ద తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు నివాళులు అర్పించారు.

తెలంగాణ 2
తెలంగాణ అమరవీరుల స్థూపం అయిన గన్ పార్కు వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించి జై తెలంగాణ నినాదాలు చేస్తున్న దృశ్యం.

తెలంగాణ 3
తెలంగాణ అమరవీరుల స్థూపం అయిన గన్ పార్కు వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించి పావురాలు ఎగురవేస్తున్న దృశ్యం.

తెలంగాణ 4
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించి పావురాలు ఎగురవేస్తున్న దృశ్యం.

తెలంగాణ 5
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించిన అనంతరం నవంబర్ 1 దినం బ్లాక్ డే అంటూ ఫ్లెక్సీని ప్రదర్శిస్తున్న దృశ్యం.

తెలంగాణ 6
నవంబర్ 1ని తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలని, ఇంటింటి పైన నల్ల జెండాలు ఎగురవేయాలని ఫ్లెక్సీ ప్రదర్శిస్తున్న తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క.

తెలంగాణ 7
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి, ఇతరులు నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

తెలంగాణ 8
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం అసెంబ్లీ వైపుకు దూసుకెళ్లిన విద్యార్థులు.

తెలంగాణ 9
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం అసెంబ్లీ వైపుకు దూసుకెళ్లిన విద్యార్థులు జై తెలంగాణ శాసన సభ అనే ఫ్లెక్సీని కట్టారు.

తెలుగు తల్లి 1
రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా సచివాలయం ముందున్న తెలుగు తల్లి విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు, రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్ రెడ్డి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications