తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సాక్షి పత్రిక' డబ్బు చోరీ, తిరుపతి హుండీలో.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఓ దినపత్రికకు సంబంధించిన నగదును చోరీ చేసిన 9మంది నిందితులను అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి తెలిపారు. ఓ పథకం ప్రకారం సాక్షి పత్రికలో పని చేసే గణాంకాల అధికారి నుంచి నాటకీయ పక్కీలో 30,21,510 రూపాయలు చోరీ చేసిన 9మందిని తిరుపతి క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి చోరీ సొమ్ములో ఖర్చు చేయగా మిగిలిన 20లక్షల నగదును, చోరీకి వినియోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

జల్సాలకు అలవాటుపడి, చేసిన అప్పులు తీర్చుకునేందుకు వీరు ఈ దోపిడీకి పాల్పడ్డారని తిరుపతి ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాక్షి దినపత్రిక కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న శ్రీనివాసులు (23) దాదాపు 5లక్షల రూపాయలు వరకు అప్పులు చేశాడు.

వాటిని తీర్చుకునే మార్గంలేక.. ప్రతి నెలా 13వ తేదీన తమ కార్యాలయం నుంచి శెట్టిపల్లి ఎస్బీఐ కార్యాలయంలోజమ చేయడానికి డబ్బులు తీసుకువెళుతున్న సిబ్బందిపై దాడి చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జూలై, ఆగస్టు మాసాల్లో చోరీకి యత్నించారు. వీలు కాకపోవడంతో సెప్టెంబర్ 13వ తేదీన పత్రికా కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనంపై వెళుతున్న అకౌంట్స్ ఆఫీసర్ ద్విచక్ర వాహనాన్ని ఎపి 04 ఎపి 3033 నెంబర్ స్కార్పియోలో వచ్చిన ఆరుగురు తమ వాహనంతో ఢీకొన్నారు.

సాక్షి దినపత్రిక

సాక్షి దినపత్రిక

అకౌంట్స్ ఆఫీసర్ కింద పడగానే స్కార్పియో వెనుకే వచ్చిన శివప్రకాష్ రెడ్డి, మహేష్ డబ్బులున్న బ్యాగ్‌ను తీసుకుని పారిపోయారు.

సాక్షి దినపత్రిక

సాక్షి దినపత్రిక


ఈ సంఘటనపై గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసినా ఎస్పీ ఆదేశాల మేరకు ఈకేసును తిరుపతి సీసీఎస్‌కు బదిలీ చేశారు. సిసిఎస్ పోలీసులు తమ విచారణలో 9మంది నిందితులను గుర్తించారు.

సాక్షి దినపత్రిక

సాక్షి దినపత్రిక

సాక్షి సెక్యూరిటీ గార్డుగా పని చేసిన పులివెందుల రామచంద్రాపురంకు చెందిన శ్రీనివాసులు (23), కడపకు చెందిన వినయ్ కుమార్ రెడ్డి (23), శివప్రకాష్ రెడ్డి (20), వెంకట నరేంద్ర (23), మహేష్ (22), హరిబాబు (20), రామచంద్రాపురంకు చెందిన పవన్ కుమార్ (20), బద్వేలుకు చెందిన రవీంద్ర రెడ్డి (23), చెన్నూరుకు చెందిన బాలకృష్ణా రెడ్డి (27)లను కోడూరు-మామండూరు రోడ్డులోని మామండూరు అడవి వద్ద మంగళవారం అరెస్టు చేసినట్లు తెలిపారు.

 సాక్షి దినపత్రిక

సాక్షి దినపత్రిక

చోరికి పాల్పడ వీరు తాము దొంగిలించిన సొమ్ములో దాదాపు 2 లక్షల రూపాయలను పాప పరిహారం కోసం తిరుమల, విజయవాడ, కాణిపాక ఆలయాల హుండీల్లో, కడప చర్చిలో దాదాపు రెండు లక్షల రూపాయలు వరకు ఇచ్చారని వివరించారు.

 సాక్షి దినపత్రిక

సాక్షి దినపత్రిక


దాదాపు 10 లక్షల రూపాయలు తమ జల్సాలకు ఖర్చు చేశారన్నారు. మిగిలిన సొమ్మును, చోరీకి వినియోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ సంఘటన జరిగిన 20 రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు.

English summary

 Photos of Tirupati Sakshi theft accused arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X