బాబు రెచ్చగొట్టకు: తెరాస వార్‌రూంలో ఇలా.. (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ స్వామిగౌడ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌లు మండిపడ్డారు.

పక్క రాష్ట్రంతో చంద్రబాబుకు పనేమిటని వారు అడిగారు. ఎవరి రాష్ట్రాన్ని వాళ్లం బాగు చేసుకుందామని ఆయన శనివారం చంద్రబాబుకు సలహా ఇచ్చారు. వార్ రూమ్ ఏర్పాటు చేసింది యుద్ధం చేయడానికి కాదని, ఉద్యోగులు పంపకం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి మాత్రమేనని స్పష్టత ఇచ్చారు.

ఉద్యోగుల సమాచారాన్ని సేకరించడానికి దాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. సీమాంధ్రలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్ర సచివాలయంలోనే పని చేయాలని వారు అన్నారు.

తెరాస

తెరాస

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడే విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ శనివారం విమర్శించారు.

తెరాస

తెరాస

తెలంగాణలో అధికారంలోకి వస్తామని రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగులు ఎవరి రాష్ట్రంలో వాళ్లు పని చేయాలని చెప్పడం రెచ్చగొట్టడం అవుతుందా? అని ప్రశ్నించారు.

తెరాస

తెరాస

తెలంగాణలో సీమాంధ్ర ఉద్యోగుల వివరాలు సేకరించేందుకు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన వార్ రూమ్‌ను శనివారం శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. దీని కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఏర్పాటు చేశారు.

తెరాస

తెరాస

కెసిఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు చెబుతున్నారు, ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

తెరాస

తెరాస

తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో పని చేయాలి, తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి, అదే విధంగా సీమాంధ్ర ఉద్యోగులు సీమాంధ్రలో పని చేస్తూ సీమాంధ్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పడం రెచ్చగొట్టడం అవుతుందా? అని ప్రశ్నించారు.

తెరాస

తెరాస

విభజన తరువాత కూడా తెలంగాణలో తామే ఆధిపత్యమే చెలాయిస్తాం.. అన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారని తెరాస నేతలు ఆరోపించారు.

తెరాస

తెరాస

విడిపోయిన తరువాత కూడా పెత్తనం చలాయించాలనుకోవడం రెచ్చగొట్టడమే అవుతుందన్నారు. తెలంగాణ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు మాత్రమే ఉంటారని, సీమాంధ్ర ఉద్యోగులు ఉండేందుకు వీలు లేదని అన్నారు.

తెరాస

తెరాస

విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.ఉద్యోగులకు సంబంధించిన సమాచార సేకరణకు మాత్రమే వార్‌రూమ్ ఏర్పాటు చేశామని, వార్ రూమ్ యుద్ధాల కోసం కాదని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తెలిపారు.

తెరాస

తెరాస

ఉద్యోగ విభజనలో తెలంగాణకు అన్యాయం జరగకుండా యుద్ధప్రాతిపధికన సమాచారం సేకరించడానికి వార్ రూమ్ ప్రయత్నిస్తుందని తెలిపారు.

తెరాస

తెరాస

ఉద్యోగులను రెచ్చగొడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలను సవరించుకోవాలని సూచించారు.

తెరాస

తెరాస

సీమాంధ్రలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే తెలంగాణకు రప్పించాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యుడు స్వామి గౌడ్ కోరారు.

తెరాస

తెరాస

తెలంగాణ భవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ స్వామిగౌడ్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌లు మండిపడ్డారు.

తెరాస

తెరాస

పక్క రాష్ట్రంతో చంద్రబాబుకు పనేమిటని వారు అడిగారు. ఎవరి రాష్ట్రాన్ని వాళ్లం బాగు చేసుకుందామని ఆయన శనివారం చంద్రబాబుకు సలహా ఇచ్చారు. వార్ రూమ్ ఏర్పాటు చేసింది యుద్ధం చేయడానికి కాదని, ఉద్యోగులు పంపకం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి మాత్రమేనని స్పష్టత ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+