బాధ చెప్పుకున్న జగన్, పర్వాలేదన్న బాబు (పిక్చర్స్)
హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాగతించారు. అయితే ఇంకా చేయాల్సి ఉండెనని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.
బడ్జెట్ నేపథ్యంలో చంద్రబాబు హైదరాబాదులోని లేక్ వ్యూ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపొందించారని కొనియాడారు.
ఇక, ఢిల్లీలో వైయస్ జగన్.. టీడీపీ ఆరాచకాలకు పాల్పడుతోందని రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిలకు ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్నారని తమ పార్టీ నేతల పైన హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని, తమ బాధలు ఎవరితో చెప్పుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రణబ్‌తో జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇస్తున్న దృశ్యం.

ప్రణబ్‌తో జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. వినతి పత్రం ఇస్తున్న దృశ్యం.

మీడియాతో జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం లేక్ వ్యూ అతిథి గృహంలో కేంద్ర బడ్జెట్ అంశంపై విలేకరులతో మాట్లాడారు.

చంద్రబాబు
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వం తొలి ఏడాది బడ్జెట్ బాగా చేసిందని, ఇంకా చేయాల్సి ఉందన్నారు. ఈ బడ్జెట్ అభివృద్ధి కోణంలో ముందుకు తెచ్చారని చెప్పారు.

చంద్రబాబు
వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి పెంపు మంచిదని చంద్రబాబు అన్నారు. ఐఐటీ, ఐఐఎంలు విజ్ఞాన సమాజంలో ముందడుగు అని కొనియాడారు. కాకినాడ హార్డ్ వేర్ పార్కు ద్వారా నిరుద్యోగ సమస్యను తొలగించడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.

చంద్రబాబు
దీర్ఘకాలిక లక్ష్యాల కోసం జైట్లీ తాపత్రయపడ్డారని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చేందే వరకు కేంద్రం సహకరించాలని కోరారు. ఆర్థిక సమానతలు తొలగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు.

చంద్రబాబు
బడ్జెట్‌లో పారిశ్రామిక ప్రగతి పైన దృష్టి సారించారని చంద్రబాబు కితాబిచ్చారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌తో ఏపీకి ఉపయోగమన్నారు. రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఎం తదితర సంస్థల ఏర్పాటు హర్షణీయమన్నారు. అయితే ఇంకా ఎన్నో సంస్థలు రావాల్సి ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications