ఎడాపెడా వాడారు, కేసీఆర్‌కి సలహా: జగన్... (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరి, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు తాను గోదావరి జిల్లాలో ఎంపిక చేసిన వేదికపైన నిరాహార దీక్ష చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మంగళవారం ప్రకటించారు.

రైతులకు, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని ప్రకటించి మోసం చేసిన చంద్రబాబు ద్వంద్వ విధానాలకు నిరసనగా ఈ నెల 5వ తేదీన అన్ని మండలాల్లో ఎమ్మార్వో కార్యాలయాలవద్ద ధర్నా చేస్తున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 5న 13 జిల్లా కలెక్టరేట్ల ఎదుట చంద్రబాబు ప్రజా విద్రోహ విధానాలకు నిరసనగా ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

మంగళవారం వైయస్ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకోమాట చెబుతూ ఇంతవరకు పైసా కూడా మాఫీ చేయలేదన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

రుణమాఫీ చేస్తారన్న రైతులకు 14వేల కోట్ల రూపాయల రుణభారం గత ఏడాదికి పడిందని, ఈ ఏడాది మరో 14 వేల కోట్ల రూపాయలు బ్యాంకులు అపరాధ వడ్డీని విధిస్తాయన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఎన్నికలకు ముందు చంద్రబాబు తాను మొత్తం అధ్యయనం చేసి రైతుల రుణమాఫీ చేయవచ్చని హామీ ఇచ్చానని ఎన్నికల సంఘానికి కూడా లేఖ ఇచ్చారని జగన్ గుర్తు చేశారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

బాబుకు ఓటు వేస్తే జాబు వస్తుందనే భ్రమలు కల్పించి యువతను మోసం చేశారన్నారు. మొత్తం 43 లక్షలమంది పెన్షనర్లలో పది లక్షలమందిని తొలగించారన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

రైతులు రుణాలు చెల్లించకపోవడంతో రెన్యువల్ కాలేదని, దీనివల్ల పంటల బీమా పథకం కూడా అమలు కాలేదని వైయస్ జగన్ అన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

చంద్రబాబు, కేసీఆర్ ఎడాపెడా శ్రీశైలం కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల నీటిమట్టం 857 అడుగులకు తగ్గిందన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

పోతిరెడ్డిపాడు 840 అడుగుల ఎత్తులో ఉందని, 854 అడుగుల మేర శ్రీశైలంలో నీటిని నిల్వ చేయకపోతే రాయలసీమకు తాగునీరు అందదన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

గతంలో చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దేందుకు వైయస్ రాజశేఖరరెడ్డి 107 జీవో జారీ చేసి 854 అడుగుల నీటిమట్టం ఉండాలని నిర్దేశించారని ఆయన చెప్పారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా సింహాద్రినుంచి 500 మెగావాట్లు, రామగుండం నుంచి 2600 మెగావాట్లలో 60 శాతం విద్యుత్‌ను తీసుకుని చత్తీస్‌గఢ్‌నుంచి కొనుగోలు చేసే 1000మెగావాట్లను ఎన్టీపిసికి ఇవ్వాలన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

దీనివల్ల విద్యుత్ నష్టాలుండవన్నారు. విశాఖ పెనుతుపాను సహాయ చర్యల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. రాజధానికి ఎంపిక చేసిన ప్రదేశంలో రైతులకు అన్యాయం జరిగితే బాసటగా నిలుస్తామన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

శ్రీశైలం జల వివాదం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం స్పందించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

శ్రీశైలం జల వివాదం విషయంలో విలేకరులు జగన్ స్టాండ్‌ను అడిగారు. ఈ సందర్భంగా జగన్ స్పందించారు. శ్రీశైలం జల వివాదం పైన తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశానని, అది చదివి తన స్టాండ్ ఏమిటో తెలుసుకోవాలన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

అది మీరు చదివినట్లు లేరని, మళ్లీ అందరికీ ఇస్తామని జగన్ విలేకరులతో అన్నారు. చంద్రబాబు తెలిసినా తప్పు చేసే రకమని విమర్శించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

శ్రీశైలంలో రైట్ సైడ్ చంద్రబాబు, లెఫ్ట్ సైడ్ కేసీఆర్ ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేశారని, పదిహేను రోజుల్లో భారీగా నీటిమట్టం తగ్గించాలని ధ్వజమెత్తారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఇద్దరు ఎడాపెడా వాడేశారన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు చంద్రబాబు ఆపేసి.. కేసీఆర్‌ను తిడతారని విమర్శించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఈ వివాదం ఇంత దూరం వచ్చేది కాదన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

సముద్రంలోకి నీళ్లను ఎలా పంపిస్తున్నారో చూస్తున్నామన్నారు. తెలంగాణకు విద్యుత్ అవసరం ఉందని తమకు తెలుసునని, అయితే, కేసీఆర్ కూడా కొంత మానవత్వంతో ఆలోచించాలన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఛత్తీస్‌గఢ్‌తో కేసీఆర్ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. అయితే, కేసీఆర్ ఖర్మ ఏమిటంటే.. విద్యుత్ సరఫరాకు మరో రెండుమూడేళ్లు పట్టవచ్చునన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

రామగుండం థర్మల్ పవర్, ఎన్టీపీసీ విద్యుత్ విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తాను సలహా ఇస్తున్నానని చెప్పారు.

యస్ జగన్

యస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరి, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వచ్చే జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు తాను గోదావరి జిల్లాలో ఎంపిక చేసిన వేదికపైన నిరాహార దీక్ష చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మంగళవారం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+