హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నమ్మ, పెద్దమ్మలంటూ జగన్ హావభావాలు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రాన్ని విడగొట్టడమే కాకుండా తాను పెద్దమ్మ అని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, తాను చిన్నమ్మ అని బిజెపి సీనియర్ నేత సుష్మాస్వరాజ్ చెప్పుకోవడం దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అద్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మండిపడ్డారు.

సీమాంధ్ర, తెలంగాణలో తాను, తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, సోదరి షర్మిల, అందరు నేతలు పార్టీ అభివృద్ధి, విస్తరణకు చిత్తశుద్ధిగా కృషి చేస్తామన్నారు. ప్రజల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమన్నారు.

బుధవారం హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. రాష్ట్రాన్ని విడగొట్టినా తెలుగుజాతిని విడగొట్టలేరన్నారు. తెలంగాణలో కూడా తమ పార్టీ ఉంటుందని ఆయన ప్రకటించారు.

జగన్

జగన్

తమ పార్టీ సుపరిపాలన కోసం కృషి చేస్తుందని, రాష్ట్రాన్ని విడగొట్టి భావోద్వేగాలను సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్, బిజెపి జాతీయ పార్టీలు ప్రయత్నించడం సిగ్గుచేటని జగన్ అన్నారు.

జగన్ హావభావాలు

జగన్ హావభావాలు

దురదృష్ఠకరమైన పరిస్థితుల మధ్య ఎన్నికలకు వెళుతున్నామని, తెలుగు జాతి అంతా ఒకటిగా ఉంటే మంచి మేలు జరుగుతుందని జగన్ అన్నారు.

నేతలు

నేతలు

తమ పార్టీ దృష్టిలో సమైక్యాంధ్ర అంటే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా సోదరులు కలిసి ఉండి అభివృద్ధి సాధించాలని జగన్ చెప్పారు.

జగన్ నమస్కారం

జగన్ నమస్కారం

మంచి పనులు చేసి ఓట్లు అడగాలని, రాష్ట్రాన్ని చీల్చి ఓట్లు కావాలని అడగడం, ప్యాకేజీలు ఇస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని హామీలు ఇవ్వడం కంటే మించిన దౌర్భాగ్య పరిస్థితి మరొకటి ఏముందన్నారు.

సమావేశంలో జగన్

సమావేశంలో జగన్

రాష్ట్రాన్ని చీల్చినా, భూములను విడగొట్టినా, తెలుగు జాతిని మాత్రం ఎవరూ వేరుచేయలేరని, తెలుగువారు ఎక్కడున్నా, వారి మనసులు, వారి ఆప్యాయతలను ఏమీ చేయలేరన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Wednesday fired at AICC president Sonia Gandhi and BJP leader Sushma Swarj.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X