వెంటిలేటర్‌పై బద్రి పెద్ద కుమారుడు: స్పృహలో భార్య (పిక్చర్స్)

ఏలూరు: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీవీ9 చానెల్ న్యూస్ రీడర్ భార్య లక్ష్మీసుజాత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె స్పృహలోనే ఉన్నారు. ఆమెను టీవీ9 సిఇవో రవిప్రకాష్ పరామర్శించారు. కాగా, బద్రి పెద్దకుమారుడు సాయి సందీప్ పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అతన్ని వెంటలేటర్‌పై ఉంచినట్లు సమాచారం. ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మరణించగా, చిన్న కుమారుడు సాయి సాత్విక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

లక్ష్మీసుజాత చెయ్యి విరగడంతోపాటు ఆమె వెన్నుపూస వద్ద బలమైన గాయమైంది. ఆమెను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెదడుకు దెబ్బ తగిలి, పుర్రె ఎముక ఫ్రాక్చర్‌ కావడంతో పెద్ద కుమారుడికి వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నారు. బద్రి బావమరిది గండ్రోతు తారక్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో విజయవాడ ప్రైవేటు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

పోలీసులు బద్రి మృతదేహానికి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం జరిపించి బంధువులకు అప్పగించారు. బద్రి అమ్మమ్మ ఊరు ఆవపాడు. ఆ గ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆ తరువాత తండ్రి ఉద్యోగ రీత్యా ఉంగుటూరులో నివాసం ఉన్నారు. ఆ తరువాత విజయవాడలో స్థిరపడ్డారు. ఆవపాడులోని మేనమామ కుమార్తె లక్ష్మీసుజాతను వివాహం చేసుకున్నారు.

న్యూస్ రీడర్ బద్రి మృతి

న్యూస్ రీడర్ బద్రి మృతి

టీవీ9 న్యూస్ రీడర్ బద్రి పదేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన అసలు పేరు కాళ్ల వీరభద్రయ్య. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఒక్కొక్క మెట్టే ఎదుగుతూ తనదైన ముద్రను వేశారు.

కారులోనే మృతి

కారులోనే మృతి

బద్రి స్వయంగా కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. టైరు పోలిపోవడంతో కారు చెట్టుకు ఢీకొని ప్రమాదం జరిగింది. కారులోనే అతను విగతజీవుడయ్యారు.

కారు నుజ్జు నుజ్జు

కారు నుజ్జు నుజ్జు

బద్రితో పాటు అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయింది. బద్రి సీటు బెల్టు పెట్టుకోనట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు

కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు

బద్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులంతా గాయపడ్డారు. చిన్న కుమారుడు సాయి సాత్విక్ చికిత్స పొందుతూ మరణించాడు.

బద్రి మృతదేహానికి నివాళులు

బద్రి మృతదేహానికి నివాళులు

బద్రి మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన భౌతిక కాయానికి పలువురు నివాళులు అర్పించారు.

ప్రమాదంలో ఇలా...

ప్రమాదంలో ఇలా...

ప్రమాదంలో గాయపడి ఇలా స్పృహ కోల్పోయిన బద్రి కుటుంబ సభ్యుడొకరు ఇలా కనిపించాడు. తీవ్రమైన గాయం కనిపిస్తోంది.

వెంటలేటర్‌పై కుమారులు..

వెంటలేటర్‌పై కుమారులు..

బద్రి కుమారులు సాయి సాత్విక్, సాయి సందీప్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చిన్న కుమారుడు సాత్విక్ చికిత్స పొందుతూ మరణించాడు.

చిన్న కుమారుడు మృతి

చిన్న కుమారుడు మృతి

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బద్రి చిన్న కుమారుడు సాయి సందీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ లోకాన్ని వీడిపోయాడు.

బద్రికి నివాళులు

బద్రికి నివాళులు

బద్రి కారు ప్రమాదంలో మరణించడం అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది. పలువురు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

పుష్పగుచ్ఛం ఉంచి..

పుష్పగుచ్ఛం ఉంచి..

బద్రి భౌతిక కాయంపై అభిమానులు, నేతలు, శ్రేయోభిలాషులు పూలమాలలు ఉంచి, ఆయన మృతికి శ్రద్ధాంజలి ఘటించారు.

కారు ముందు భాగమంతా...

కారు ముందు భాగమంతా...

బద్రి కుటుంబం ప్రయాణిస్తన్న కారు చెట్టుకు ఢీకొట్టింది. దాంతో కారు ముందు భాగమంతా నామరూపాలు లేకుండా ధ్వంసమైంది.

పోలీసుల దర్యాప్తు

పోలీసుల దర్యాప్తు

కొద్ది సేపట్లో ఊరి చేరుకుంటాడనగా బద్రి ప్రమాదానికి గురయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

కారులోనే బద్రి

కారులోనే బద్రి

అత్యంత విజయవంతమైన న్యూస్ ప్రెజెంటరర్‌గా పేరు గడించిన బద్రి ప్రమాదానికి గురై కారులోనే తుది శ్వాస విడిచారు.

బద్రి కుటుంబ సభ్యులు.

బద్రి కుటుంబ సభ్యులు.

అత్యంత ఆనందకరమైన కటుంబం బద్రిది. బద్రి తన భార్యాపిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునే వాడంటారు. భార్య లక్ష్మీసుజాత కోసం అతను ప్రత్యేకంగా వంటిల్లును తీర్చిదిద్డాడు.

నిద్రపోతున్నట్లే...

నిద్రపోతున్నట్లే...

కారు ప్రమాదంలో మరణించిన న్యూస్ రీడర్ బద్రి ముఖం నిద్రపోతున్నట్లే ఉంది. ఆయన అక్కడికక్కడే మరణించాడు.

వెంటిలేటర్‌పై బద్రి కుమారుడు..

వెంటిలేటర్‌పై బద్రి కుమారుడు..

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బద్రి కుమారుడు ఇలా ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కనిపించాడు.

గాయపడిన లక్ష్మీ సుజాత

గాయపడిన లక్ష్మీ సుజాత

బద్రి భార్య లక్ష్మీసుజాత కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. సుఖసంతోషాలతో విలసిల్లుతున్న ఆమె కుటుంబంపై అదృష్టం సీతకన్నేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+