పాతబస్తీలో నాటుబాంబు పేలుడు (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సాలంచౌక్‌లోని భవానీనగర్ రోడ్డు నంబర్ 1లోని విద్యుత్ స్తంభం వద్ద మంగళవారం రాత్రి నాటుబాంబు పేలి ఇద్దరు స్వ్లల్పంగా గాయపడ్డారు. గాయపడినవారిని షేక్ అబ్దుల్లా (80), మహ్మద్ సల్మాన్ (25)గా గుర్తించారు. దీంతో బాంబుపేలుడుతో స్థానికులు భయాందోళన చెందారు.

సమాచారమందుకున్న భవానీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సంఘటనా స్థలంలో ఇనుప మొలలు, చువ్వలు స్వాధీనం చేసుకొన్నారు. పరిసర ఇళ్ళ వారిని విచారించారు. పాతబస్తీలో మొదటిసారిగా నాటుబాంబు పేలిందని స్థానికులు తెలిపారు.

బాంబు పేలుడు ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని భవానీనగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. క్లూస్‌టీమ్, బాంబుస్క్వాడ్‌తో సంఘటనా స్థలంలో తనిఖీలు నిర్వహించామన్నారు.

పాతబస్తీలో బాంబు పేలుడు

పాతబస్తీలో బాంబు పేలుడు

హైదరాబాదులోని పాతబస్తీలో మంగళవారం రాత్రి నాటుబాంబు పేలి ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన కలకలం రేపింది.

పాతబస్తీలో బాంబు పేలుడు

పాతబస్తీలో బాంబు పేలుడు

ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు ప్రత్యర్థులపై దాడికి బాంబులు తెచ్చి ఉంటారేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పాతబస్తీలో బాంబు పేలుడు

పాతబస్తీలో బాంబు పేలుడు

సంఘటనా స్థలాన్ని పోలీస్ ఉన్నతాధికారులు సందీప్ శాండిల్య, మల్లారెడ్డి, దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠి, అడిషనల్ డీసీపీ బాబురావు, ఏసీపీ సాయికృష్ణ సందర్శించారు.

పాతబస్తీలో బాంబు పేలుడు

పాతబస్తీలో బాంబు పేలుడు

హైదరాబాదు పాతబస్తీలో బాంబు పేలడం మొదటిసారి అని అంటున్నారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

క్లూస్ టీం, బాంబు స్క్వాడ్‌తో కనిఖీలు..

క్లూస్ టీం, బాంబు స్క్వాడ్‌తో కనిఖీలు..

పాతబస్తీ బాంబు పేలుడు సంఘటనపై క్లూస్ టీమ్‌ు రంగంలోకి దింపారు. బాంబ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+