జగన్ పార్టీ ఎంపి రేణుక యూటర్న్ వెనక? (పిక్చర్స్)

న్యూఢిల్లీ: కర్నూలు లోకసభ స్థానంలో మాజీ రైల్వే మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఓడించి జెయింట్ కిల్లర్‌గా అవతరించిన బుట్టా రేణుక వ్యవహారం గమ్మత్తయిన మలుపు తిరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన ఎస్పీవై రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు టికెట్‌పై ఎంపిగా విజయం సాధించి, తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.

దాంతో అదే జిల్లాకు చెందిన బుట్టా రేణుక కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. అయితే, వెంటనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. బుట్టా రేణుకకు ఆయన నచ్చజెప్పి వెనక్కి రప్పించారు.

మేకపాటితో కలిసి ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. తాను అయోమయానికి గురయ్యానని, తాను టిడిపిలో చేరడం లేదని బుట్టా రేణుక చెప్పారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి జోక్యంతోనే ఆమె యూటర్న్ తీసుకున్నట్లు భావిస్తున్నారు.

బుట్టా రేణుక ఇలా..

బుట్టా రేణుక ఇలా..

కర్నూలు లోకసభ స్థానం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన బుట్టా రేణుక టిడిపిలోకి జంప్ చేయాలని ప్రయత్నించి వెనక్కి తగ్గారు.

అయోమయానికి గురయ్యా..

అయోమయానికి గురయ్యా..

తాను నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశానని చెప్పారు.

మేకపాటితో కలిసి రేణుక

మేకపాటితో కలిసి రేణుక

తన పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డితో కలిసి బుట్టా రేణుక మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఇలా కనిపించారు...

ఇలా కనిపించారు...

బుట్టా రేణుక టిడిపిలో చేరడానికే సిద్ధపడినట్లు అనిపించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డితో బుట్టా రేణుక ఇలా కనపించడమే సాక్ష్యమని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+