టిడిపిలోకి రాయపాటి, బాబుకు పచ్చడి (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యాలయంలో సోమవారం ఉగాది పర్వదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా పంచాంగ పఠనం జరిగింది. చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు సగం చేదును, సగం తీపిని మిగిల్చేట్లున్నాయి. సీమాంధ్రలో పటిష్టంగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో నీరసపడినట్లు సర్వేలో తేలింది.
అదే సమయంలో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరిగాయి. తాజాగా, ఇదే రోజు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రాయపాటి సాంబశివ రావు రాక టిడిపికి ప్రయోజనం చేకూర్చి పెడుతుందని చెప్పడంలో సందేహం లేదు.
అయితే, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు దీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బిజెపితో పొత్తు కుదిరితే అది కాస్తా సులభం కావచ్చునని అంటున్నారు.

చంద్రబాబు ఇలా..
ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలనం చేస్తూ ఇలా కనిపించారు.

బాబుతో నన్నపనేని..
ఉగాది ఉత్సవాల సందర్భంగా సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో చంద్రబాబుతో పాటు పూజలు చేస్తూ ఆ పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి కనిపించారు.

తెలంగాణపైనా దృష్టి..
సామాజిక తెలంగాణను ఏర్పాటు చేస్తానని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. కానీ తెలంగాణలో ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో చేదు ఫలితాలే రావచ్చునని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

చంద్రుడేనా..
రాజు, మంత్రి చంద్రుడే కావడంతో ప్రజలకు మేలు జరిగే పాలన వస్తుందని, అందరికీ సమన్యాయం జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్కుడు పొన్నలూరి శ్రీనివాస గార్గేయ అంటూ పంచాంగ పఠనం గావించారు.

ఆశీర్వాదం తీసుకుంటూ..
శ్రీనివాస గార్గేయ నుంచి ఆశీర్వాదం తీసుకుంటూ చంద్రబాబు నాయుడు ఇలా కనిపించారు. భవిష్యత్తు బాగానే ఉంటుందని హామీ తీసుకుంటున్నట్లుగా..

టిడిపిలోకి రాయపాటి...
గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావును తన నివాసంలో చంద్రబాబు నాయుడు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.

గల్లా జయదేవ్ కూడా..
ఇటీవలే టిడిపిలో చేరి గుంటూరు లోకసభ స్థానం సీటు పొందిన గల్లా జయదేవ్ రాయపాటి చేరిక సమయంలో చంద్రబాబు చెంత ఇలా కనిపించారు.

రాయపాటితో మోదుగల అసంతృప్తి
చంద్రబాబు గూటికి రాయపాటి చేరడంతో నర్సారావుపేట సిట్టింగు పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు.

బిజెపి కార్యాలయంలో పంచాంగ శ్రవణం
హైదరాబాదులోని బిజెపి కార్యాలయంలో కూడా ఉగాది ఉత్సవాలు జరిగాయి. పంచాంగ పఠనం జరిగింది.
-
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications