వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు కలిసిపోయి, ముచ్చటించి, డప్పు కొట్టి.. (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో రెండో రోజు గురువారం ప్రజలతో కలిసిపోయి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారిలో ఒక్కడిగా కలిసిపోయే ప్రయత్నం చేశారు.

పారిపాలన అంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూర్చోడంకాదని, ప్రజలకు అందుబాటులో ఉండాలనే జిల్లాల పర్యటన చేపట్టినట్లు ఆయన అన్నారు. జిల్లాలోని నర్సన్నపాలెంలో ప్రజలతో ఆయన ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏ పని చేసినా పేదవాళ్లను దృష్టిలో పెట్టుకునే పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. తాగడానికి మంచినీళ్లు లేకపోయినా ఎక్కడిక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయని, దీని వల్ల సమాజంలో అనేక సమస్యలు వచ్చాయని, అందుకే బెల్ట్ షాపులు రద్దు చయాలని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినట్లు అయన తెలిపారు.

మహిళల మధ్య బాబు

మహిళల మధ్య బాబు

ఇక్కడ గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారని, వారిని అభివృద్ధి మార్గంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.

ఇలా దరువేశారు..

ఇలా దరువేశారు..

స్థానికులతో కలిసిపోయి చంద్రబాబు నాయుడదు ఇలా దరువేశారు. గిరిజనులకు ఆయన ఆత్మవిశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు.

మాగంటి బాబు ఇలా..

మాగంటి బాబు ఇలా..

మాగంటి బాబు స్థానిక గిరిజనులకు సంబంధించిన కొమ్ములతో కూడిన శిరస్త్రాణాన్ని చంద్రబాబుకు తొడుగుతూ ఇలా కనిపించారు.

గిరిజన ప్రాంతాల్లో ఇలా..

గిరిజన ప్రాంతాల్లో ఇలా..

చంద్రబాబు నరసన్నపాలెం, బయ్యన్నగూడెం, కొయ్యలగూడెం వంటి గిరిజన గ్రామాల్లో పర్యటించి, వారితో కలిసిపోయారు.

గిరిజన నృత్యం...

గిరిజన నృత్యం...

చంద్రబాబు పర్యటన సందర్భంగా గిరిజనులు ఇలా ఆటపాటలతో అలరించారు. కనులవిందు చేశారు.

చివరి రక్తం బొట్టు వరకు..

చివరి రక్తం బొట్టు వరకు..

తన చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు పేదవాళ్లకోసం పనిచేస్తానని, పేదవాళ్లను ఆదుకుంటానని, పేదవాళ్లకు న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు అన్నారు.

ప్రజలతో ముఖాముఖి..

ప్రజలతో ముఖాముఖి..

నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడారు. అన్ని సమస్యలనూ పరిష్కరిస్తానని చెప్పారు.

శ్రద్ధగా విన్నారు...

శ్రద్ధగా విన్నారు...

ప్రజలు వినిపించే సమస్యలను చంద్రబాబు నాయుడు తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో శ్రద్దగా విన్నారు.

పంటనలను పరిశీలిస్తూ...

పంటనలను పరిశీలిస్తూ...

చంద్రబాబు నాయుడు తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. పంటలను పరిశీలించారు.

పాలన అంటే ఎక్కడో లేదు...

పాలన అంటే ఎక్కడో లేదు...

పరిపాలన ఉంటే ఎక్కడో మారుమూలన కూర్చోవడం కాదని, ప్రజలకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు అన్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu tried to mingle with public in his West Godavari district tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X