మన్యం వీరుడు అల్లూరికి చంద్రబాబు నివాళి (పిక్చర్స్)
హైదరాబాద్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్యాంక్‌బండ్‌పై ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
విశాఖలోని కృష్ణదేవపేటలో అల్లూరి సీతారామరాజు, గంటందొర, మల్లుదొరలను సమాధి చేశారని, ఆ ప్రాంతంలో అల్లూరి స్మారక మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేత బండారు దత్తాత్రేయ, తెలుగుదేశం పార్టీ నేతలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు విశాఖలోఘనంగా జరిగాయి. అల్లూరి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అల్లూరి స్వగ్రామం విశాఖ జిల్లా పద్మనాభ మండలం పండ్రంగిలో జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. సీతారామరాజు విగ్రహానికి నేతలు పూలమాలు వేసి నివాళులర్పించారు. అల్లూరి జన్మించిన ఇంటిని నేతలు సందర్శించారు.

అల్లూరి సీతారామరాజుకు నివాళి
హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.

అల్లూరి సీతారామరాజుకు నివాళి
అల్లూరి సీతారామరాజుకు నివాళులు అర్పించిన కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు బిజెపి నేత బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

అల్లూరి సీతారామారాజుకు నివాళి
హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాల వేస్తున్న చంద్రబాబు

సీతారామరాజుకు నివాళులు
అల్లూరి సీతారామరాజుకు చంద్రబాబు నివాళులు అర్పించిన కార్యక్రమంలో టిడిపి నేతలు, అధికారులు పాల్గొన్నారు.

సీతారామరాజుకు నివాళులు...
అల్లూరి సీతారామరాజుకు చంద్రబాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు కూడా నివాళులు అర్పించారు.

సమరయోధులకు సత్కారం
అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు.

బాబుతో గజల్ శ్రీనివాస్ ఇలా..
అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్ ఇలా చంద్రబాబు నాయుడితో కనిపించారు.

చంద్రబాబు హామీ
అల్లూరి సీతారామరాజుకు నివాళులు అర్పించిన తర్వాత చంద్రబాబు ప్రసంగించారు. అల్లూరి స్మారక మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications