తెలంగాణ సంబురాల్లో బాబు, స్వీట్ తిన్నారు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబురాల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో టిడిపి నాయకులు తెలంగాణ అవతరణ వేడుకలను నిర్వహించుకున్నారు.
తెలంగాణ నేతలతో పాటు చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ నేతలు ఆయనకు స్వీట్లు తినిపించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు తెలంగాణ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహ రావు, ఎర్రబెల్లి దయాకర రావు, దేవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతోమంది త్యాగాల ఫలితమే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము 2008లో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామన్నారు. కెసిఆర్, ఆయన టీం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తెరాస ప్రభుత్వంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.

తెలంగాణ సంబురాల్లో బాబు
పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో సోమవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

జాతీయ పతాకను ఆవిష్కరించిన బాబు
భారతదేశం 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జాతీయ పతాకను ఆవిష్కరించారు.

తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

స్వీట్ తినిపించారు
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ నేతలు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి స్వీట్ తినిపించారు.












Click it and Unblock the Notifications