చంద్రబాబుతో కమల్ హాసన్ భేటీ: చీకటి రాజ్యం సినిమా కోసమేనా? (పిక్చర్స్)
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ భేటీ కావడంపై పలు ఊహాగానాలు చెలరేగాయి. అమరావతిలో సినీ పరిశ్రమకు సంబంధించిన ఓ సంస్థను నెలకొల్పాలని కమల్ హాసన్ భావిస్తున్నారని, అందుకే చంద్రబాబును కలిశారని అన్నారు.
రాబోయే చీకటి రాజ్యం సినిమా ప్రీమియర్ షోను విజయవాడలో ప్రదర్శించేందుకు అనుమతి కోసం చంద్రబాబును కలిసినట్లు కమల్ హాసన్ చెప్పారు. చీకటి రాజ్యం చూడాల్సిందిగా తాను చంద్రబాబును కోరినట్లు కూడా ఆయన తెలిపారు.
తన విజ్ఞప్తిని చంద్రబాబు సంతోషంగా అంగీకరించారని ఆయన చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చీకటి రాజ్యం సినిమా ప్రీమియర్ షోలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే రోజు ప్రదర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

చంద్రబాబుతో కమల్ హాసన్ భేటీ
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. చంద్రబాబు ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

చంద్రబాబుతో కమల్ హాసన్ భేటీ
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ గురువారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి 40 నిమిషాల పాటు మాట్లాడారు.

చంద్రబాబుతో కమల్ హాసన్ భేటీ
తాను చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిశానని, అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానం అందినప్పటికీ రాలేకపోయానని, ఇప్పుడు అభినందనలు తెలిపానని కమల్ హాసన్ చెప్పారు.

చంద్రబాబుతో కమల్ హాసన్ భేటీ
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌కు ఎన్టీ రామారావు బొమ్మతో కూడిన జ్ఞాపికను చంద్రబాబు అందించి సత్కరించారు.

చంద్రబాబుతో కమల్ హాసన్ భేటీ
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్‌కు శాలువా కప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్కరించారు.












Click it and Unblock the Notifications