సాగర్ శుద్ధి: మాదీ ఆ ఫ్యామిలయేనని కెసిఆర్ (పిక్చర్స్)

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బుధవారంనాడు బిజీగా గడిపారు. వివిధ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. భూసేకరణపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితులకు పునరావాస ప్యాకేజీ వీలైనంత త్వరగా ఇవ్వాలని కెసిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు అవసరమైన భూసేకరణ చట్టాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. రిజిస్ట్రేషన్ విలువ కన్నా ఎక్కువ మొత్తం నిర్వాసితులకు ఇవ్వాలని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ తరఫున పూర్తి సహకారం ఉంటుందని ఆయన చెప్పారు.

హైదరాబాదు నగరంలోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు సంజీవయ్య పార్కు, బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట జిహెచ్‌ఎంసి సోమేష్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు. పరిశీలన అనంతరం సాగర్ ప్రక్షాళనపై కెసిఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

భూసేకరణపై కెసిఆర్ సమీక్ష

భూసేకరణపై కెసిఆర్ సమీక్ష

భూసేకరణలో భూమిని కోల్పోయే వారికి అండగా నిలువాలని కెసిఆర్ అధికారులకు సూచించారు. మానేరు డ్యామ్ నిర్మాణంలో తమది కూడా బాధిత కుటుంబమేనని, ఆ బాధ తనకు తెలుసునని ఆయన అన్నారు.

కెసిఆర్‌తో రఘురాం రాజన్

కెసిఆర్‌తో రఘురాం రాజన్

కొత్త రుణాల విషయంలో బ్యాంకులు చొరవ చూపడం లేదని కెసిఆర్‌తో భేటీ తర్వాత రఘురాం రాజన్ అన్నారు. రైతులకు కొత్త రుణాల విషయం పరిశీలిస్తామని ఆయన చెప్పారు. గ్రామీణ మౌలిక సదుపాయాలకు త్వరలో ఓ విధానం తెస్తామని చెప్పారు.

కెసిఆర్‌తో రఘురాం రాజన్

కెసిఆర్‌తో రఘురాం రాజన్

చెరువుల పునరుద్ధరణకు ఆర్థిక సాయం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరినట్లు రఘురాం రాజన్ తెలిపారు. ఈ విషయం పరిశీలిస్తామని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని కెసిఆర్ రఘురాం రాజన్‌ను కోరారు. ఈ పరిశ్రమల ప్రోత్సహానికి చిన్న బ్యాంకుల అనుమతి అవసరమని రాజన్ అన్నారు.

హుస్సేన్ సాగర్ ప్రక్షాళణ

హుస్సేన్ సాగర్ ప్రక్షాళణ

ముఖ్యమంత్రి కెసిఆర్ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి బుధవారంనాడు పరిశీలించారు.

హుస్సేన్ సాగర్ ప్రక్షాళణ

హుస్సేన్ సాగర్ ప్రక్షాళణ

హుస్సేన్ సాగర్ ప్రక్షాళణకు చర్యలు తీసుకోవాలని సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారులను ఆదేశించారు.

ఇందిరా పార్కులో సరస్సు

ఇందిరా పార్కులో సరస్సు

హుస్సేన్ సాగర్ ఆనకట్ట కింద ఉన్న ఇందిరా పార్కులో చిన్నపాటి సరస్సును ఏర్పాటు చేయాలని, అందులో బతుకమ్మలను, వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే విధంగా చూడాలని కెసిఆర్ సూచించారు.

నగరవాసుల భాగస్వామ్యం

నగరవాసుల భాగస్వామ్యం

హుస్సేన్ సాగర్ ప్రక్షాళణలో హైదరాబాద్ నగర ప్రజలను భాగస్వాములను చేస్తామని ముఖఅయమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు.

అందమైన చెరువుగా...

అందమైన చెరువుగా...

హుస్సేన్ సాగర్‌ను పరిశుభ్రమైన, అందమైన చెరువుగా రూపొందించాలని కె. చంద్రశేఖర రావు సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించారు.

మురికి నీరు చేరకుండా..

మురికి నీరు చేరకుండా..

హుస్సేన్ సాగర్‌లోకి మురికి నీరు చేరకుండా చుట్టూ ఓ కాలువ తవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచించారు.

మంచినీరు పంపి..

మంచినీరు పంపి..

హుస్సేన్ సాగర్‌లోకి మంచినీరు పంపించి, షెట్టర్లు మూసేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+