బాబు చేస్తే తప్పు లేదు, నేను చేస్తే..: కెసిఆర్ (పిక్చర్స్)

హైదరాబాద్: నిబంధనల మేరకు శ్రీశైలం రిజర్వాయర్ నీటిని విద్యుదుత్పత్తికి వాడుకుంటామని, ఇందులో రాజీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తేల్చి చెప్పారు. ఆంధ్రవాళ్ల కుట్రల వల్లనే తెలంగాణకు విద్యుత్తు కష్టాలు వచ్చాయని ఆయన ఆరోపించారు. నదీ జలాల కేటాయింపులు, వాడకంలో 58 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.
తెలంగాణ సొంత రాష్ట్రంగా ఏర్పడినా ఇప్పటికీ అదే వివక్ష కొనసాగుతోందని, కరెంట్‌ ఇవ్వడం లేదని, నీటి వాడకం వద్దంటున్నారని అంటూ తాము ఏం చేయాలని కెసిఆర్ అడిగారు. ఇప్పటికైనా ఈ పద్ధతిని మార్చాలని దోపిడీని అరికట్టాలని కెసిఆర్ కృష్ణా నది యాజమన్య బోర్డు చైర్మన్‌ కృష్ణ పండిట్‌ను కోరారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రితో బోర్డు చైర్మన్‌ సమావేశమయ్యారు.

ఉత్తర్వుల మేరకే

ఉత్తర్వుల మేరకే

ఉమ్మడి రాష్ట్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారమే తాము నీటిని ఉపయోగిస్తున్నామని, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 54 శాతం కరెంట్‌ రావాల్సి ఉన్నా పంపిణీ జరగలేదని, గోదావరి బోర్డు, సెంట్రల్‌ ఎలక్ర్టిసిటీ అధారిటీ చెప్పినా చంద్రబాబు సీలేరు కరెంట్‌ ఇవ్వడం లేదని కెసిఆర్ పండిట్‌తో చెప్పారు.

ఆంధ్రవాళ్ల కుట్రలు..

ఆంధ్రవాళ్ల కుట్రలు..

కృష్ణపట్నంలో తెలంగాణ జెన్‌కో, డిస్కంలు రూ.1050 కోట్ల పెట్టుబడి పెట్టినా కరెంట్‌ను ఇవ్వడం లేదని, ఇలా ఆంధ్ర వారు కుట్రల వల్ల నేడు తెలంగాణలో కరెంట్‌ కష్టాలు వచ్చాయని, ఈ నేపథ్యంలో శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి అనివార్యమైందని కెసిఆర్ చెప్పారు.

జీవోలు ఇలా ఉన్నాయి..

జీవోలు ఇలా ఉన్నాయి..

69, 233 జీవోల ప్రకారం శ్రీశైలంలో 834 అడుగుల వరకు నీటిని ఉపయోగించుకోవచ్చునని, చంద్రబాబు పాలనలో ఈ జీవోలు ఉన్నప్పటికీ 834 అడుగుల కంటే దిగువ నీటిని కూడా ఉపయోగించారని, బాబు హయాంలో అవసరాల కోసం ఏ స్థాయి నీటిని వాడుకున్నా తప్పు లేదు గానీ తాము మాత్రం నిబంధనలకు లోబడి నీటిని ఉపయోగిస్తే...నేరమా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.

హక్కు ఉన్నా అలా...

హక్కు ఉన్నా అలా...

తెలుగుగంగ ద్వారా 15 టీఎంసీలు, ఎస్‌ఆర్‌బీసీ ద్వారా 19 టీఎంసీలు మాత్రమే వాడుకునే హక్కు ఉన్నప్పటికీ సుమారు 338 టిఎంసీలు వాడుకునేలా ఆంధ్రావాళ్లు రిజర్వాయర్లను నిర్మించారని, పోతిరెడ్డిపాడు ద్వారా జల దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని, తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌, ఎస్‌ఎల్‌బీసీ, ఆర్‌డీఎస్‌ ప్రాజెక్టులు పూర్తి కాలేదని, కానీ ఆంధ్రలోని ప్రాజెక్టులకు అనుమతి లేకపోయినా పూర్తి చేశారని పండిట్‌కు కెసిఆర్ వివరించారు.

తెలంగాణలో నెలకొన్న పరిస్థితి, విద్యుత్‌ కొరత గురించి బోర్డు చైర్మన్‌ పండిట్‌కు కేసీఆర్‌ వివరించారు. ఇక్కడ బోరు బావులపై రైతులు ఆధారపడ్డారని, ప్రస్తుతం పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నాయని, ఈ సమయంలో రాష్ట్రంలో సరిపోయిన విద్యుత్‌ లేదని, చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన విద్యుత్‌ రావడం లేదని, శ్రీశైలం నుంచి విద్యుత్‌కు నీటి వినియోగం వద్దంటున్నారని చెబుతూ ఇలాంటి పరిస్థితుల్లో తాము ఏం చేయాలో చెప్పాలని కెసిఆర్ అడిగారు.

ఈ నెల 29న కృష్ణా బోర్డు సమావేశానికి సాగునీటి నిపుణుడు విద్యాసాగర్‌రావు హజరవుతారని, సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి వాడకానికి సంబంధించి కచ్చితమైన ఆపరేషనల్‌ రూల్స్‌ రూపొందించే విధంగా చర్యల్ని తీసుకోవాలని కెసిఆర్ పండిట్‌ను కోరారు. ప్రస్తుత పంటలను కాపాడడానికి వచ్చే నెల 5 వరకు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని, అప్పటికి విద్యుత్‌ డిమాండ్‌ కొంత తగ్గే అవకాశం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలంలో నీటిని వాడుకునే హక్కు, జల విద్యుత్‌ ఉత్పత్తి చే సుకునే హక్కు తెలంగాణకు ఉందని, ఇందులో ఏలాంటి రాజీ పడే పరిస్థితి లేదని అంటూ ఈ హక్కును బోర్డు కాపాడాలని కేసీఆర్‌ కోరారు.

ఇదే విషయాన్ని 2002లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారంటూ కెసిఆర్ తన వాదనను గట్టిగా వినిపించారు. ఈ అఫిడవిట్‌తో పాటు పాత జీవోలు ఇతర పత్రాలను బోర్డు ఛైర్మన్‌కు అందజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+