టీ సచివాలయంలో కెసిఆర్, వెనక కవిత (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సోమవారంనాడు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఆయన సచివాలయానికి వచ్చారు. ఆయన వెంట పార్లమెంటు సభ్యురాలు, కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. సచివాలయంలోకి వచ్చిన ఆయన పోచమ్మ దేవాలయంలో కెసిఆర్ పూజలు చేశారు.

ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన ఆయన ప్రభుత్వోద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉద్యోగులతో తమ ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.

సచివాలయంలోకి కెసిఆర్

సచివాలయంలోకి కెసిఆర్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న తర్వాత తెలంగాణ సిఎంగా కెసిఆర్ సచివాలయంలోకి అడుగు పెట్టారు.

కెసిఆర్ వెంట కేశవరావు

కెసిఆర్ వెంట కేశవరావు

తెరాస పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావును కెసిఆర్ సోమవారం తన వెంటే ఉంచుకున్నారు. ఆయనను మరీ పిలుచుకున్నారు.

కెసిఆర్ వెనకే కవిత

కెసిఆర్ వెనకే కవిత

కెసిఆర్ సచివాలయంలో పోచమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెనక కూతురు కల్వకుంట్ల కవిత ఉన్నారు.

సచివాలయంలో కెసిఆర్

సచివాలయంలో కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయంలోకి అడుగు పెట్టారు. పదవీ బాధ్యతలు చేపట్టారు.

కెసిఆర్‌కు ఘనస్వాగతం

కెసిఆర్‌కు ఘనస్వాగతం

సచివాలయంలో కెసిఆర్‌కు ఘనస్వాగతం లభించింది. కెసిఆర్‌ను తెలంగాణ ఉద్యోగాలు ఘనంగా ఆహ్వానించారు.

సచివాలయంలో కెసిఆర్

సచివాలయంలో కెసిఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారం సచివాలయంలో ఇలా కనిపించారు.

కెసిఆర్‌తో శ్రీనావస్ గౌడ్

కెసిఆర్‌తో శ్రీనావస్ గౌడ్

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మహబూబ్ నగర్ శాసనసభా నియోజకవర్గం నుంచి విజయం సాధించిన శ్రీనివాస్ గౌడ్‌తో కెసిఆర్.

సచివాలయంలో కెసిఆర్

సచివాలయంలో కెసిఆర్

సచివాలయంలో తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కెసిఆర్ జై తెలంగాణ నినాదం ఇచ్చారు.

ఉద్యోగులతో కెసిఆర్

ఉద్యోగులతో కెసిఆర్

ఉద్యోగులను ఉద్దేశించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రసంగించారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తామని చెప్పారు.

ఉద్యోగ నేతలతో కెసిఆర్

ఉద్యోగ నేతలతో కెసిఆర్

తెలంగాణ ఉద్యోగ నేతలతో కెసిఆర్ ఇలా కనిపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దేవీప్రసాద్ తదితరులు కీలక పాత్ర పోషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+