Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిరణ్ రెడ్డితో కెటిఆర్ చేతులు కలిపారు (పిక్చర్స్)

హైదరాబాద్: కాంగ్రెసు శాసనసభ్యుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాసిన ప్రపంచ దేశాలు - పాలనా వ్యవస్థలు అనే పుస్తకం ఆవిష్కరణ సభలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. నిత్యం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాటల ఈటెలు విసిరే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు ఆయనతో చేతులు కలిపారు.

కిరణ్ కుమార్ రెడ్డితో కెటి రామారావు కరచాలనం చేయడమే కాకుండా నవ్వుతూ పలకరించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ సభకు అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. వెంకటేశ్వర రావు సతీమణి, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా సమావేశానికి హాజరయ్యారు.

జస్టిస్ చలమేశ్వర్‌తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు వేదిక మీద ఆసీనులయ్యారు.

దగ్గుబాటి కెటిఆర్ కరచాలనం

దగ్గుబాటి కెటిఆర్ కరచాలనం

సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుతో తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు కరచాలనం చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు.

కిరణ్ రెడ్డి, కెటిఆర్ ఇలా నవ్వుతూ..

కిరణ్ రెడ్డి, కెటిఆర్ ఇలా నవ్వుతూ..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు కరచాలనం చేశారు. ఇద్దరు నవ్వుతూ పలకరించుకున్నారు. వారిద్దరినీ చూస్తూ దగ్గుబాటి ఇలా..

ఏం మాట్లాడుకున్నారు...

ఏం మాట్లాడుకున్నారు...

కిరణ్ కుమార్ రెడ్డిపై నిత్యం కత్తులు నూరే కెటి రామారావు ఏమని పలకరించారు... ముఖ్యమంత్రి ఏమన్నారు... వారిద్దరికే తెలుసు కాబోలు..

పుస్తకావిష్కరణ ఇలా..

పుస్తకావిష్కరణ ఇలా..

దగ్గుబాటి వెంకటేశ్వర రావు పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత రాజకీయ నాయకులతో పాటు డి. రామానాయుడు, జస్టిస్ చలమేశ్వర్ ఇలా..

పురంధేశ్వరితో దగ్గుబాటి ఇలా...

పురంధేశ్వరితో దగ్గుబాటి ఇలా...

పుస్తకావిష్కరణ సభలో తన సతీమణి, కేంద్ర మంత్రి పురంధేశ్వరి చేయి పట్టుకుని దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఏదో చూపిస్తున్నారు... కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలనగా చూస్తున్నారు.

చలమేశ్వర్‌తో మాట్లాడుతున్న దగ్గుబాటి

చలమేశ్వర్‌తో మాట్లాడుతున్న దగ్గుబాటి

వేదికపై జస్టిస్ చలమేశ్వర్‌తో దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాట్లాడుతుంటే పురంధేశ్వరి పరిశీలనగా చూస్తున్నారు. మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ రెడ్డితో దగ్గుబాటి..

కిరణ్ రెడ్డితో దగ్గుబాటి..

తన పుస్తకావిష్కరణ సభకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తోడ్కొని వస్తున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు

పుస్తకావిష్కరణ సభలో ఇలా..

పుస్తకావిష్కరణ సభలో ఇలా..

డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పుస్తకావిష్కరణ సభలో ఇలా కనిపించారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు సభకు వచ్చారు.

జయకృష్ణతో కెటి రామారావు..

జయకృష్ణతో కెటి రామారావు..

ఎన్టీ రామారావు కుమారుడు జయకృష్ణతో కరచాలనం చేస్తూ కెటి రామారావు కనిపించారు. మధ్యలో వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.

కెటిఆర్ జయకృష్ణ ఇలా..

కెటిఆర్ జయకృష్ణ ఇలా..

ఎన్టీ రామారావు కుమారుడు, దగ్గుబాటి పురంధేశ్వరి సోదరుడు జయకృష్ణతో మాట్లాడుతున్న కెటి రామారావు

కిరణ్ రెడ్డికి పురంధేశ్వరి నమస్కారం

కిరణ్ రెడ్డికి పురంధేశ్వరి నమస్కారం

తన భర్త, శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పుస్తకావిష్కరణ సభకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నమస్కారంతో ఆహ్వానం పలుకుతున్న కేంద్ర మంత్రి పురంధేశ్వరి

ముఖ్యమంత్రితో రాఘవులు..

ముఖ్యమంత్రితో రాఘవులు..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పలకరిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్సి బివి రాఘవులు. సిపిఎం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+