బియాస్ ట్రాజెడీ: మంతాకు కన్నీటి వీడ్కోలు (పిక్చర్స్)
హైదరాబాద్: బియాస్‌నదిలో కొట్టుకుపోయిన ఇంజనీరింగ్ విద్యార్ధి ఆశిష్ మంతా (20) మృతదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం చిలకలగూడ శ్రీనివాస్‌నగర్‌కాలనీలోని ఇంటికి తీసుకువచ్చారు.
ఆశిష్‌మంతా తల్లి సత్యవాణి, కుటుంబసభ్యులు, బంధువులు శవపేటికపై పడి గొల్లుమన్నారు. ఆశిష్ మంతాతో హిమాచల్‌ప్రదేశ్ వెళ్ళిన తోటి విద్యార్థులూ కనీటి పర్యంతమయ్యారు.
సికింద్రాబాదులోని చిలకలగూడ శ్రీనివాస్‌నగర్‌కాలనీలో నివసించే ఎంవీఎన్ మూర్తి, సత్యవాణిలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు భరద్వాజ్ అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నారు. రెండో కుమారుడు ఆశిష్‌మంతా బాచుపల్లి వీఎన్ఆర్ విజ్ఞాన్ కాలేజీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఆశిష్‌మంతా తండ్రి గత సెప్టెంబర్‌లో మృతి చెందాడు.

శోకమూర్తిగా మారిన తల్లి
కుమారుడి మృతదేహాన్ని చూసే అవకాశం లేకపోవడంతో తల్లి మనసు తల్లడిల్లింది. పన్నెండురోజులు తరువాత ఆశిష్‌మంతా మృతదేహం బియాస్‌నది లో దొరికింది.

బాక్సులో మృతదేహం
మృతదేహాం బాగా ఉబ్బిపోవటంతో శవపేటిక (ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సు)లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి నగరానికి తీసుకొచ్చారు. శవపేటికను తెరవకపోవటంతో ఆశిష్‌మంతా తల్లి సత్యవాణి కొడుకును చివరి చూపు కూడా చూసుకోలేకపోయారు.

బోరుమన్న సోదరుడు
తల్లి, సోదరుడు భరద్వాజ్ బోరున విలపించారు. ఆశిష్‌మంతా మృతితో శ్రీనివాస్‌నగర్‌కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.

పన్నెండు రోజుల తర్వాత
12 రోజులు తరువాత మంతా మృతదేహం దొరికింది. బియాస్ నది వద్ద చేపట్టిన గాలింపు చర్యల్లో ఆశిష్ అన్నయ్య భరద్వాజ్ కూడా పాల్గొన్నా రు.

శోకసముద్రం ఇలా..
ఆశిష్ మంతా మృతదేహన్ని శుక్రవారం ఉద యం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి, అక్కడ నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తీసుకొచ్చారు.

అశ్రనయనాల మధ్య అంత్యక్రియలు
ఆశ్రునాయలతో ఆశిష్‌మంతాకు బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మంతా అమరే రహే అంటూ నినాదాలు కూడా చేశారు.












Click it and Unblock the Notifications