సినిమాపై మురళీ మోహన్ మాటే చెల్లుబాటా (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైదరాబాదు నుంచి తెలుగు సినీ రంగం తరలిపోవడానికి అంత సుముఖంగా లేనట్లు కనిపిస్తోంది. విశాఖను తెలుగు సినీరంగానికి మకుటాయమానంగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ సినీ ప్రముఖులు హైదరాబాదును వదలడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ మాటలు సినీ రంగం అభిమతానికి అద్దం పడుతున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. చిత్ర పరిశ్రమను హైదరాబాదు నుంచి తరలించడం కష్టమని మురళీ మోహన్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర రావు పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా సినీ ప్రముఖుల అభిప్రాయం మారలేదని అంటున్నారు. సినీ ప్రముఖులు పలువురు ఆంధ్ర ప్రాంతానికే చెందినవారు అయినప్పటికీ హైదరాబాదును వీడడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు కెసిఆర్‌ను ఇది వరకు కలిశారు కూడా.

యాభై ఏళ్లు పట్టింది...
తెలుగు చలన చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుండి తరలించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ రావడానికి యాభై ఏళ్లు పట్టిందన్నారు.

ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు...
ఇప్పటికిప్పుడు విశాఖ గానీ, రాజమండ్రి గాని చిత్ర పరిశ్రమ వెళ్లడం కుదరదని స్పష్టం చేశారు. విశాఖను చిత్రపరిశ్రమకు కేంద్రంగా చేస్తామని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.

విశాఖ దృశ్యాలు సరే...
హైదరాబాదులో కొనసాగుతూనే విశాఖ కూడా చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోయినా అక్కడు కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందవచ్చు.

గంటా శ్రీనివాస రావు దృష్టి
సినీ పరిశ్రమను విశాఖపట్నం తీసుకుని రావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మురళీ మోహన్ ప్రకటనలోని ఆంతర్యం చూస్తే ఆయన కృషి ఇప్పుడిప్పుడే ఫలించేట్లు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications