పవన్ కళ్యాణ్ నాగలి ఎత్తాడు, లెక్క ఇదేనట (పిక్చర్స్)
అనంతపురం: తెలుగుదేశం, బిజెపి కూటమికి అనుకూలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం అనంతపురం బహిరంగ సభలో ప్రసంగించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సీమాంధ్ర ప్రజలపై విరుచుకుపడిన కెసిఆర్‌ను తిట్టే ధైర్యం జగన్‌కు లేదా అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. రాయలసీమ పచ్చగా కళకళలాడాలాని ఆకాంక్షించారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాయలసీమ రతనాలసీమ అవుతుందన్నారు. జగన్ వేల కోట్టు దోచుకుని జైలుకెళ్లాడని, సీమాంధ్రకు జగన్ ముఖ్యమంత్రి కాలేదని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని విభచించిన తీరు బాధ కలిగించిందని పవన్ అన్నారు. రాజధాని లేకుండా నడిరోడ్డుపై ఉన్నామని, సీమాంధ్ర అభివృద్ధిని చూడాలన్నదే తన కోరిక అని తెలిపారు. జగన్ దోచుకున్న ప్రతి పైసా ప్రజల సొమ్మే అని ఆయన అన్నారు.

ఇలా నాగలి ఎత్తాడు..
అనంతపురం ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా నాగలి ఎత్తాడు. ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు.

డబ్బు తీసుకున్నా...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల నుంచి డబ్బు తీసుకున్నా ఓటు మాత్రం టిడిపి, బిజెపిలకే వేయాలని పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు.

నా లెక్క ఇదే..
తనకు తిక్క ఉంది గానీ లెక్క లేదని కొంత మంది అంటున్నారని, అవినీతిని తరిమికొట్టడమే తన లెక్క అని పవన్ కల్యాణ్ అన్నారు.

సినిమా తీయాలని...
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తనను సినిమా తీయాలని ఆదేశించే ధోరణిలో అడిగారని, దాంతో తనకు కోపం వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు.












Click it and Unblock the Notifications