చిరుకు ఊరట: పవన్ కళ్యాణ్ విశాఖ టెంపో (పిక్చర్స్)
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్కంఠకు తెర దించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం, లోకసత్తాలతో కలిసి మహా కూటమిలో జనసేన పాలు పంచుకుంటుందని భావిస్తూ వచ్చారు. కానీ, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి, ఆ ఊహాగానాలకు తెర దించారు. ఆయన కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు అర్థమవుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
పవన్ కళ్యాణ్ జనసేన పోటీలో ఉంటే కాపుల ఓట్లు చీలి, కాంగ్రెసుకు నష్టం జరుగుతుందని భావిస్తూ వచ్చారు. అయితే, ఓట్లు చీల్చడం ఇష్టం లేకనే తాను పోటీకి దిగడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది చిరంజీవికి కొంత మేరకు ఊరట కలిగించే విషయమే.
పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల లోపు జనసేన రాజకీయ సభలు నిర్వహించే అవకాశం లేదని తెలిసిపోతూ ఉంది. అలాగే, ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొనకపోవచ్చునని అంటున్నారు. దీంతో కాంగ్రెసు ప్రచార రథసారథిగా ఉన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేసే చిక్కుల నుంచి బయటపడినట్లేనని భావిస్తున్నారు.

గబ్బర్ సింగ్ వేషంలో..
పవన్ కళ్యాణ్ సినిమాలో గబ్బర్ సింగ్ పాత్ర వేషధారణలో ఓ అభిమాని వేదికపైకి వచ్చి ఇలా వినోదం అందించారు.

అభిమానులకు అభివాదం..
గురువారం సాయంత్రం ఏడు గంటల 20 నిమిషాల ప్రాంతంలో వేదికపైకి వచ్చిన పవన్ కళ్యాణ్ వేదికపై సంచరిస్తూ అభిమానాలకు ఇలా అభివాదం చేశారు.

అదే ఆవేశం, ఉద్వేగం..
ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందే పవన్ కళ్యాణ్ తీవ్ర ఉద్వేగానికి, భావావేశానికి లోనయ్యారు. తన పార్టీకి ప్రత్యేకంగా మ్యానిఫెస్టో లేదని చెప్పారు.

అభిమానుల కేరింతలు..
పవన్ కళ్యాణ్ ప్రసంగానికి అభిమానులు కేరింతలు కొట్టారు. ఆయన ప్రసంగానికి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇజం పుస్తకం విడుదల..
తన తాత్విక, సైద్ధాంతిక విధానాలను వ్యక్తం చేస్తూ రాసిన ఇజం పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. అది తన అనుభవాలను ఆధారం చేసుకుని రాశానని ఆయన చెప్పారు.

జనసేన టీ షర్టులతో..
పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు జనసేన టీ షర్టులు ధరించి విశాఖపట్నం వేదిక వద్ద సందడి చేశారు.

అన్నయ్యతో విభేదం ..
అన్నయ్య చిరంజీవి, తాను ఎదురు శిబిరాల్లో ఉండాల్సి రావడం దైవలీల అని అన్నారు. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగతుందని భావించానని ఆయన చెప్పారు.

అన్నయ్యపై గుండెల నిండా ప్రేమ
అన్నయ్య చిరంజీవిపై తనకు గుండెల నిండా ప్రేమ ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే, దేశ పరిస్థితులు తనను రాజకీయాల్లోకి తెచ్చాయని ఆయన అన్నారు.

తన్ని తగిలేస్తాం...
తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని, అయితే గెలిచిన ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే సహించబోదని, తన్ని తగిలేస్తోందని ఆయన చెప్పారు.

టార్గెట్ 2019
పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలను లక్ష్యం చేసుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతోంది. నిజాయితీ, సామాజిక నిబద్ధత గల యువత దొరికినప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్ల పాటు ఆయన వారిని గుర్తించే పనిచేసే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications