బాబుతో నటి సన ముచ్చట, కృష్ణయ్య బాణం (పిక్చర్స్)
హైదరాబాద్: సినీ నటి సన, బిసి నేత ఆర్ కృష్ణయ్య శుక్రవారం చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిద్దరు చంద్రబాబుతో వేదికపై ముచ్చట పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమని అందుకే తెలుగుశంలో చేరినట్లు సన తెలిపారు.
అరవై ఏళ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, కేంద్రం, రాష్ట్రం నుంచి బిసీలకు రావాల్సిన వాటా, రిజర్వేషన్లు దక్కడం లేదని టిడిపిలో చేరిన తర్వాత ఆర్. కృష్ణయ్య అన్నారు. దీనిపై పోరాడటానికి మన శక్తి సరిపోవడం లేదని, ఇప్పటివరకూ అన్ని పార్టీలు బీసీలతో జెండాలు మోయించాయని, టిడిపి ఒక్కటే బీసీని సీఎం చేస్తానని చెప్పిందని ఆయన అన్నారు. సమయం వచ్చిందని, స్పందించి టిడిపికి ఓటు వేసి బీసీనే సీఎం చేద్దామని ఆయన అన్నారు. ఇది బీసీల ఇజ్జత్ కీ సవాల్ అని ఆర్. కృష్ణయ్య బీసీలకు పిలుపునిచ్చారు.
అందుకే 40 ఏళ్లుగా పోరాడుతున్నానని చెప్పారు. టిడిపి రూపంలో బీసీలకు రాజ్యాధికారం దక్కించుకునే అవకాశం వచ్చిందని అన్నారు. ఈ అవకాశం పోతే మరో వందేళ్లయినా ఇలాంటి అవకాశం రాదని, కాబట్టి, బీసీలు టీడీపీకి ఓట్లు వేయాలని కోరారు.

ఆర్. కృష్ణయ్య పసుపు కండువా..
బిసి సంఘాల నేత ఆర్. కృష్ణయ్య మెడపై పసుపు రంగు కండువా కప్పి ఆయనను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.

ఒక్క రోజే పండుగ
దొరకు ఓటు వేస్తే పోలింగ్ జరిగే ఒక్కరోజు మాత్రమే పండుగని, అదే బిసిని సీఎం చేస్తే జీవితం అంతా పండుగేనని ఆర్ కృష్ణయ్య తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అన్నారు.

కృష్ణయ్య టిడిపిలో ఇలా..
1983లోనే ఎన్టీఆర్ నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారని, తాను సుఖంగా ఉండాలని కోరుకుంటే అప్పుడే ఆ పని చేసేవాడినని, తనకు తన కన్నా తన జాతి సుఖం ముఖ్యమని కృష్ణయ్య అన్నారు.

చంద్రబాబు రామబాణం..
తెలంగాణలో రామబాణం వదిలానని చంద్రబాబు రాష్ట్రమంతా చెప్పుకుంటున్నారు. ఆ రామబాణం బిసి నేత కృష్ణయ్య అనేది అందరికీ తెలిసిన విషయమే.

తెలంగాణలో బిసీ మంత్రం..
తెలంగాణకు బిసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన చంద్రబాబు బిసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ బాణం ఎటు దూసుకుపొతుందో మరి..

సన ముచ్చట..
తెలుగుదేశం పార్టీలో చేరిన సినీ నటి సన చంద్రబాబుతో వేదికపై ముచ్చట పెడుతూ కనిపించారు. ఆమెకు తెలుగుదేశంలో ఏ విధమైన ప్రాధాన్యం దక్కుతుందో చూడాలి.

ఇక రాజకీయ పాత్ర
తెలుగు చిత్ర పరిశ్రమలో సన గౌరవం, కందిరీగ, సింహ, రగడ, బృందావనం, గోపిగోపికగోదావరి వంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు రాజకీయాల్లో పాత్ర పోషించనున్నారు.

టిడిపి ధైర్యం చేసింది..
తెలంగాణలో గెలిస్తే బీసీ వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రిని చేయాలని టిడిపి ధైర్యంగా రాజకీయ నిర్ణయం తీసుకొని ప్రకటించిందని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications