దొరకని అదితి: అనుమానాలు, డ్రైవర్ ఇలా (పిక్చర్స్)

విశాఖపట్నం: విశాఖపట్నంలో ఐదు రోజుల కిందట కాలువలో పడి అదృశ్యమైన అదితి ఆచూకీ ఇంకా లభించలేదు. నాలుగు రోజుల నుంచి జివిఎంసి, ఫైర్, నేవీ సిబ్బంది అహర్నిహశలు గాలిస్తున్నారు. అయినా బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. దీనిపై ఇప్పుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

అనుమానాలు తలెత్తడంతో అదితి తాత వెంకటేశ్వరరావు ఇంట్లో పనిచేస్తున్న కారు డ్రైవర్ రఘునాథ్‌ను పోలీసులు విచారిస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షం కాస్త తగ్గిన తరువాత కారు డ్రైవర్ అదితి చదువుతున్న ట్యూషన్ సెంటర్‌కు వెళ్లాడు. అందులోనే డ్రైవర్ కుమార్తె కూడా చదువుతోంది.

వీరిద్దరితో పాటు మరో బాలుడిని కూడా అదే కారులో ఇంటికి తీసుకురావాల్సి ఉంది. హెచ్‌బి కాలనీలోని ఒక భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ట్యూషన్ సెంటర్ నుంచి ముగ్గురు పిల్లలను బయటకు తీసుకువచ్చానని, బాలుడిని ముందు సీట్లో ఎక్కిస్తున్నానని, తన కుమార్తెతోపాటు, అదితి వెనుక డోర్ వద్ద నిలబడి ఉన్నారని చెప్పాడు.

ఇది నమ్మవచ్చా..

ఇది నమ్మవచ్చా..

తన కుమార్తె కారు డోర్ తీస్తున్న సమయంలో అదితి కాస్త వెనక్కు జరిగినప్పుడు అక్కడే ఉన్న కాలువలో పడి కొట్టుకుపోయిందని తన కుమార్తె అరిచిందని డ్రైవర్ రఘునాథ్ చెబుతున్నాడు.

నేను చూడలేదన్న డ్రైవర్

నేను చూడలేదన్న డ్రైవర్

తన కూతురు అరిచేటప్పటికే అదితి కాలువలో కొట్టుకుపోయిందని, అదితి కాలువలో పడడం తాను చూడలేదని డ్రైవర్ చెప్పాడు.

ఇతను చూశాడట...

ఇతను చూశాడట...

కాలువలో పడిన ఆ చిన్నారి కొట్టుకుపోవడాన్ని రామకృష్ణ అనే వ్యక్తి కళ్ళారా చూశాడు. కాలువలో పడిపోకపోతే నాలుగు రోజులైనా అదితి ఆచూకీ ఎందుకు లభ్యం కాలేదన్నదనే ప్రధాన ప్రశ్న.

జల్లెడ పట్టారు...

జల్లెడ పట్టారు...

ఘటనా స్థలం నుంచి ఆ కాలువ సముద్రంలో కలిసే ప్రదేశం వరకూ ఉన్న ప్రాంతాన్ని జివిఎంసి, పోలీస్, ఫైర్, నేవీ సిబ్బంది జల్లెడ పట్టారు. అయినా ఫలితం దక్కలేదు.

ఒక్కరోజే...

ఒక్కరోజే...

శుక్రవారం ఒక్కరోజే ఆరుసార్లు ఈ కాలువ మొత్తాన్ని గాలించినా ఫలితం కనిపించలేదు. నేవీ హెలికాప్టర్లు నిరంతరం గాలిస్తున్నా ఫలితం కనిపించలేదు.

చనిపోయి ఉంటే..

చనిపోయి ఉంటే..

ఒకవేళ అదితి కాలువలో కొట్టుకుపోయి ఉంటే ఆమె శరీరమైనా లేదా బాలికతోపాటు ఉన్న స్కూల్ బ్యాగ్, చెప్పులు, దుస్తులైనా లభించి ఉండాలని వాదన వినిపిస్తోంది.

మిస్సింగ్ కేసుగా నమోదు...

మిస్సింగ్ కేసుగా నమోదు...

అదితి అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేశామని నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్‌ను వివరణ చెప్పారు. దీనిపై డిసిపి, ఎసిపిలు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇలా గాలింపు...

ఇలా గాలింపు...

ఆదివారంనాడు జివిఎసి ఆధ్వర్యంలో హెచ్‌బీ కానీల నుంచి లాసన్స్‌బే వరకు డ్రైనేజీలు అణువణువు గాలించారు. నేవీ, పోలీసు సిబ్బంది సముద్రంలో గాలించారు. నేవీకి చెందిన ఆరుగురు డైవ్రస్, జెమినీ ఆటో బోట్లలో సముద్ర జలాల్లో పరిశీలించారు.

సముద్రంలోకి చేరి ఉండదు...

సముద్రంలోకి చేరి ఉండదు...

డ్రైనేజీ కాలువలో పడిపోయిన అదితి ఒక వేళ మరణించి ఉంటే మృతదేహం సముద్రంలోకి రాకుండా ఎక్కడో చిక్కుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. అదితి బతికే ఉంటుందని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+