మృత్యు మార్గం: ఔటర్‌పై మృతులు వీరే (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు ఆగడం లేదు. హైదరాబాదులోని
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చి తిరిగి గుంటూరు వెళుతుండగా తుక్కుగూడ ఔటర్ రింగ్‌రోడ్డుపై డివైడర్‌ను ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
గుంటూరు జిల్లా చుండూరుకు చెందిన మల్లికార్జున్‌రెడ్డి (53) తన తల్లి బస్వమ్మ (75) అనారోగ్యానికి గురికావడంతో నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆరోగ్యం కుదుటపడడంతో గురువారం తల్లితో పాటు బంధువు బాలకృష్ణారెడ్డి (29)తో కలిసి మధ్యాహ్నం కారులో గుంటూరు బయలుదేరారు. బాలకృష్ణారెడ్డి కారు డ్రైవింగ్ చేస్తుండగా, మల్లికార్జున్‌రెడ్డి, బస్వమ్మ వెనుక కూర్చున్నారు.
తుక్కుగూడలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై గల ఎక్సిట్ 14 వద్ద కారు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో నుంచి మృతదేహాలను బయటికి తీసి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

కారు డ్రైవర్ చేస్తూ మృతి
కారు డ్రైవర్ చేస్తున్న బాలకృష్ణా రెడ్డి హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కారు డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదం జరిగింది.

ఓ మహిళ మృతి
హైదరాబాదు రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లికార్జునమ్మ నిమ్స్‌లో చికిత్స పొంది తిరిగి వెళ్తుండగా మరణించింది.

మల్లికార్జున రెడ్డి మృతి
తన తల్లి బస్వమ్మకు హైదరాబాదు నిమ్స్‌లో చికిత్స చేయించి తీసుకుని వెళ్తుండగా కారు ప్రమాదంలో మరణించాడు.

కారు నుజ్జు నుజ్జు
హైదరాబాద్ రింగ్ రోడ్డుపై తుక్కుగుడా వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారు తుక్కుతుక్కు అయింది.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications