అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిపై పునఃపరిశీలన చేయమనండి: బాబుకు షాక్, తగ్గిన జోరు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాజధాని నిర్మాణ ప్రాంతంపై పునఃపరిశీలన చేయాలని, మరోవైపు ఉమ్మడి రాజధానిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను సీఆర్డీఏ పరిధిలోకి తరలించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలు అయింది.

హైకోర్టు న్యాయవాది జగన్మోహన్ రెడ్డితో పాటు మరొకరు దీనిని దాఖలు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను దృష్టిలో ఉంచుకోవాలని అందులో పేర్కొన్నారు.

ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ జరపనుంది. రాజధాని విషయమై ఒకరు కాకుంటే మరొకరు కోర్టుకెక్కుతూ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, రాజధాని అమరావతిలో భూముల క్రయవిక్రయాలు తగ్గముఖం పట్టాయి. ఎన్వోసీ (నో ఆబ్జెక్షన్ లెటర్) తీసుకోవాలన్న నిబంధనలు, భూ యజమానులు తమకు ఎంత వైశాల్యం గల స్థలాలు కావాలని సీఆర్డీఏని కోరారో అందుకు తగ్గట్లే క్రయ విక్రయాలు జరగాలన్న నిబంధనలతో క్రయవిక్రయాలు తగ్గాయి.

అమరావతి

అమరావతి

రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం రైతుల నుంచటి భూమిని తీసుకుంది. సీఆర్ీడఏకు అంగీకర పత్రాలు ఇచ్చాక కూడా భూములు అమ్ముకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

అమరావతి

అమరావతి

అధికారికంగా రాజధాని ప్రకటన వెలువడ్డాక 29 గ్రామాల పరిధిలో క్రయవిక్రయాలు పెరిగాయి. ఎన్నారైలు ఆసక్తి కనబరిచారు.

అమరావతి

అమరావతి

రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం లే అవుట్లు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్వోసీ నిబంధన అమలులోకి వచ్చింది. దీంతో భూములు కొనేవారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

అమరావతి

అమరావతి

రాజధాని ఏర్పాటు పైన ప్రభుత్వం 2014 డిసెంబర్ నెలలో ప్రకటన చేసింది. అప్పటి నుంచి ఇక్కడ క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు కొంతమేర తగ్గింది.

English summary
PIL in High Court to revision on Amaravati capital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X