మాచర్ల ఈవీఎంల ధ్వంసం కేసులో ఏ1గా పిన్నెల్లి.. అరెస్ట్ పై ఈసీకి డీజీపీ కీలకనివేదిక!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మాచర్లలో పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవిఎం, వీవీ ప్యాట్ మిషన్ లను ధ్వంసం చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. తక్షణం ఆయనను అరెస్టు చేయాలని, అరెస్ట్ పై నివేదిక పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల కమీషన్ కు డీజీపీ కీలక నివేదిక
ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కీలక నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పంపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా ద్వారా కీలక నివేదికను ఎన్నికల కమిషన్ కు అందజేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో తీసుకున్న చర్యలపైన నివేదికను ఎన్నికల సంఘానికి పంపించారు.

పిన్నెల్లి అరెస్ట్ కు తీసుకున్న చర్యలపై నివేదిక
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, పలు సెక్షన్ల కింద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై కేసులు నమోదు చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆయన పైన నమోదు చేస్తున్న సెక్షన్ల వివరాలను కూడా వెల్లడించారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పాలన విభాగం అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్టు పేర్కొన్నారు.
ఈవీఎం ధ్వంసం కేసులో ఏ వన్ గా పిన్నెల్లి
లుక్ అవుట్ సర్క్యులర్ ను కూడా జారీ చేశామని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం తెలంగాణలో సెర్చ్ కొనసాగుతుందని, దొరకగానే అరెస్టు చేస్తామని డిజిపి పేర్కొన్నారు. మాచర్లలో జరిగిన ఘర్షణలపై సిట్ ఐజి వినీత్ బ్రిజ్ లాల్ ఇచ్చిన నివేదికను కూడా పంపుతున్నామని డిజిపి వివరించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ లను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏవన్ గా చేర్చామని డిజిపి హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
పిన్నెల్లి అరెస్ట్ ను ధృవీకరించని పోలీసులు
ఇదిలా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్టుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటికీ పోలీసులు ఆయన అరెస్టును ధ్రువీకరించలేదు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు తెలంగాణలో వేట కొనసాగుతూనే ఉందని చెబుతున్నారు. ఏపీ నుండి వెళ్ళిన ప్రత్యేక బృందాలు, తెలంగాణా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్టారు. ఎన్నికల కమిషన్ నుండి వచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం పిన్నెల్లి విషయంలో డిజిపి చర్యలకు దిగారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications