ప్రకంపనలు సృష్టిస్తోన్న కొత్త సర్వే..ఏపీలో పూర్తిగా మారిపోయిన సీన్
ఏపీలో ఎన్నికల సందడి మొదలైంది. మరో కొద్దిరోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో అన్నీ రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రానికి సన్నద్ధం అవుతున్నాయి. అధికార వైసీపీని ఢీ కొట్టడానికి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ , జనసేన పొత్తులో ఉండగా, తాజాగా వీరితో బీజేపీ సైతం చేతులు కలిపింది. ఎంతమంది కలిసి వచ్చినా తమదే గెలుపని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే టీడీపీ, జనసేనతో బీజేపీ చేతులు కలపడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజాగా టీడీపీ, జనసేన కూటమి పరిస్థితి ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి ఎన్ని స్థానాల్లో విజయం సాధింస్తుందనే దానిపై పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ సర్వే చేపట్టింది. తాజాగా తమ సర్వే నివేదికను ఈ సంస్థ విడుదల చేసింది.ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన కూటమి 104 స్థానాలను గెలుచుకుంటుందని, అధికారంలో ఉన్న వైసీపీ 49 సీట్లకే పరిమితం కానుందని పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సర్వే వెల్లడించింది.

22 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉంటుందని ఈ సర్వే విశ్లేషించింది. ఇక పార్లమెంట్ స్థానాల్లో సైతం టీడీపీ, జనసేన కూటమే విజయం సాధిస్తుందని ..కూటమికి 18 స్థానాల్లో విజయం కైవసం చేసుకుంటుందని.. అధికార వైసీపీకి కేవలం ఏడు స్థానాలు మాత్రమే పరిమితం అవుతుందని ఈ సర్వే పేర్కొంది. ఈ ఎన్నికల్లో కూటమి 51.5 శాతం ఓటు షేర్‌ను పొందనుందని, వైసీపీ మాత్రం 42.6 శాతానికి పరిమితం కానుందని పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సర్వే వెల్లడించింది.
ఫిబ్రవరి రెండవ వారం నుంచి 29 మధ్య ఈ సర్వే చేపట్టమని పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ తెలిపింది. ఈ సర్వే కోసం రాష్ట్రంలోని 175 సెగ్మెంట్ల నుంచి 53,000 మంది అభిప్రాయాలను సేకరించామని, సర్వేలో పాల్గొన్నవారిలో 54 శాతం మంది పురుషులు, 46 శాతం మహిళలు ఉన్నారని వివరించింది. మొత్తానికి పయనీర్ పోల్ సర్వే అధికార వైసీపీకి మింగుడు పడటం లేదు. ఈ సర్వేను వైసీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. ఇది టీడీపీ అనూకుల సర్వే అంటూ అధికార పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు.












Click it and Unblock the Notifications