Pithapuram: మమ్మలను వెధవలను చేశారు..జనసేన కార్యకర్తల ఆడియో వైరల్..!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ నేతల మాటలు పదునెక్కుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అందరి చూపు పిఠాపురం వైపే ఉంది. ఇందుకు కారణం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. పవన్ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతుండగా.. వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఇక పిఠాపురంలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య మాటల తూటాలు మామూలుగా పేలడం లేదు. అయితే తాజాగా జనసేన కార్యకర్తలకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఆడియోలో ఏముంది..?
సోషల్ మీడియాలో పిఠాపురం అనే ఊరు లేదా పేరు ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. అక్కడ జనసేనాని పవన్ బరిలో ఉండటంతో ప్రతి ఒక్కరి కళ్లు ఆ అసెంబ్లీ సెగ్మెంట్ పైనే ఉన్నాయి. ఇక్కడ రాజకీయమంతా ఒక సామాజికవర్గం చుట్టే తిరుగుతోంది. ఇక పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రసంగంలో కాస్త పదును తగ్గినట్లు కనిపించింది. ముఖ్యంగా తనకు బలమంతా తన అభిమానులు, కార్యకర్తలే అంటూ పదేపదే చెబుతున్న పవన్ కళ్యాణ్... అవి మాటల వరకే పరిమితం అవుతున్నాయి తప్ప వాస్తవానికి జనసైనికులకు ఆ విలువ దక్కడం లేదనేది వారి ఆరోపణ ఆవేదన. అసలే పిఠాపురంలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న సందర్భంలో కార్యకర్తలు జనసేనకు సహకరించకపోతే పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మమ్మలను వెధవల కింద లెక్కగట్టారు
ఇంతకీ మ్యాటరేంటంటే.. పిఠాపురంలో జనసేన కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నారు.ఆవేదనతో ఉన్నారు. తేజ అనే జనసేన కార్యకర్త పవన్ అభిమాని తన ఆవేదన వ్యక్తం చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గోకులం గ్రాండ్‌లో పవన్‌తో సమావేశమయ్యేందుకు వార్డు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ మహిళా కార్యకర్తలు కూడా వచ్చారు. అయితే వారిని లోపలికి రానివ్వకుండా గేటుదగ్గరే వారిని అడ్డుకోవడం చాలా బాధాకరమని తేజ ఆవేదన వ్యక్తం చేశారు.అదే సమయంలో అక్కడికి టీడీపీ నేత వర్మ తన కార్యకర్తలతో రాగా అతన్ని అతని కార్యకర్తలను లోపలికి పంపడాన్ని జనసైనికులు తప్పుబడుతున్నారు. పిఠాపురంలో జనసేన ఏ కార్యక్రమం నిర్వహించిన బైకు ర్యాలీలు పెట్టి, గ్రౌండ్‌లో పనిచేసిన వాళ్లని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను వెధవల కింద లెక్కగట్టారని బాధపడ్డారు.
ఉదయ్ శ్రీనివాస్ పై కార్యకర్తల ఆగ్రహం
మరో కార్యకర్త మాట్లాడుతూ ఎవరెవరో వస్తున్నారని వారిని జనసైనికు తమ భుజం మీద ఎత్తుకుని మోయాల్సి వస్తోందని ఏంటీ మాకీ ఖర్మంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జనసేనలో ఇంఛార్జీలు సరిగ్గా లేరని వాపోయారు. వారాహికి ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్న కనీసం జ్ఞానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే అరేంజ్‌మెంట్స్ ఏ స్థాయిలో ఉండాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని అలాంటి చోట్ల ఇంఛార్జ్‌లు ఫెయిలయ్యారని మండిపడ్డారు. దీనంతటికీ కారణం ఉదయ్ శ్రీనివాస్ సమన్వయలోపమే అని తిట్టిపోశారు. వారు మాట్లాడిన ఆడియోలను వాట్సాప్‌లో షేర్ చేస్తున్నారు.
మొత్తానికి కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదని ఈ ఆడియో విన్నవారు చర్చించుకుంటున్నారు. ఇదే పరిస్థితి పిఠాపురం లాంటి ప్రెస్టీజియస్ సీటులో నెలకొంటే పవన్ గెలిచే పరిస్థితి ఉండదని జనసేన కార్యకర్తల్లోనే చర్చ జరుగుతుండటం విశేషం.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications