ఏపీలోని పొగాకు రైతులకు గుడ్ న్యూస్

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపు.. తదితర అంశాలపై చర్చించారు. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ఈ మేరకు కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్.. లాంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్టసవరణ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ ను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కోరారు.

మరోవైపు ఆయిల్ పామ్ దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలని.. దీనివల్ల రైతులు నష్టపోతారని పీయూష్ గోయల్‌ కు సీఎం చంద్రబాబు వివరించారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Piyush Goyal Meets Chandrababu Naidu to Address Tobacco Farmers Woes

సీఫుడ్‌ పై అమెరికా విధించిన 27 శాతం సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని కేంద్రమంత్రి పీయుష్ గోయల్ కు సీఎం చంద్రబాబు వివరించారు. మ్యాంగో పల్ప్‌ పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

సీఎం చంద్రబాబుతో సమావేశం అనంతరం పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమావేశం నిర్వహించారు. పొగాకు రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబుపై చర్చించామన్నారు. రాష్ట్రంలో మూడు ఇండస్ట్రియల్ పార్కులు కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కువ పొగాకు పండించడం వల్లే సమస్య వచ్చిందని.. పొగాకు సాగు తగ్గించాలని సూచించామన్నారు. రైతుల పిల్లలకు ఇచ్చే విద్యా రుణాలను చెల్లించే విషయంలో సడలింపులు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. పొగాకు రైతుల పిల్లలకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇస్తామని అంతేకాక జపనీస్, జర్మనీ , చైనా భాషలను సైతం నేర్పుతామని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+