బాబు 'సూపర్'... ఇలాంటి సీఎంని చూల్లేదు, వారు ఆసక్తి చూపరు: కేంద్రమంత్రి

Written By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు సూపర్ యాక్టివ్ ముఖ్యమంత్రి అని కితాబిచ్చారు.

దక్షిణాది రాష్ట్రాల్లో చంద్రబాబు మినహా ఏ ముఖ్యమంత్రి తనతో సమావేశమయ్యేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చరని చెప్పారు. కేంద్రం నుంచి ఏపీకి ప్రయోజనాలు పొందే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తమతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంటారన్నారు.

Chandrababu Naidu

ప్రభుత్వం నూతన విధానాలు ప్రకటించిన మరునాడే సీఎం చంద్రబాబు, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే తమతో చర్చించారని చెప్పారు. విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా దూసుకుపోతోందన్నారు. ఏడాదిలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగిందన్నారు.

చంద్రబాబు వంటి ముఖ్యమంత్రిని ఇంత వరకు చూడలేదన్నారు. ఐదైనా ఒక పని అనుకుంటే దానిని ముగించే వరకు ఆయన నిద్రపోరని కితాబిచ్చారు. 2019 నాటికి దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా పని చేస్తున్నట్లు చెప్పారు. ఉత్తర, దక్షిణ భారతావిని ఒకే గ్రిడ్‌తో అనుసంధానం చేస్తామన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Minister Piyush Goyal praises AP CM Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి