హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లేబాయ్ క్లబ్: అశ్లీలం ఉండదట, ఎ సర్టిఫికెట్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదులో ప్లేబాయ్ క్లబ్ ఏర్పాటు వివాదాస్పదమైన నేపథ్యంలో క్లబ్ ఎండి ఫరాఖ్ సంఘ్వీ వివరణ ఇచ్చారు. ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా భారత సంప్రదాయం ప్రకారం క్లబ్‌ను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

ప్లేబాయ్ పబ్‌కు అనుమతి ఇవ్వవద్దని ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన మహిళలు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్‌కు శుక్రవారంనాడు వినతిపత్రం సమర్పించారు. సంస్థ అధ్యక్షురాలు ఝాన్సీ మాట్లాడుతూ - పాశ్చాత్య సంస్కృతి అధికంగా వుండే గోవాలోనే ఈ ప్లేబాయ్ క్లబ్‌లను నిషేధించారని, మన నగరంలో ఏర్పాటు చేయడం దారుణమని అన్నారు.

అర్ధనగ్నంగా బట్టలు ధరించి పబ్‌లలో మద్యం సరఫరా చేస్తూ ఆడిపాడే ఈ పబ్‌లకు అనుమతి మంజూరు చేయడం బాధాకరమని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేసాయి. అనేక నిబంధనలు విధిస్తూ అనుమతి ఇచ్చామని, దానికి సంబంధించి మరిన్ని వివరాలను మాదాపూర్ డిసిపి క్రాంతి రాణాటాటాను కలవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ చెప్పారు.

ప్లేబాయ్ క్లబ్‌పై వివరణ

ప్లేబాయ్ క్లబ్‌పై వివరణ

ప్లేబాయ్ క్లబ్‌ను వివిధ వర్గాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో క్లబ్ ఎండీ ఫరాఖ్ సంఘ్వీ వివరణ ఇచ్చారు. అశ్లీలతకు కావు ఉండదని ఆయన చెప్పారు.

మీడియా సమావేశంలో..

మీడియా సమావేశంలో..

హైదరాబాదులోని మాదాపూర్ హోటల్ నోవాటెల్‌లో శుక్రవారం ప్లేబాయ్ క్లబ్‌పై వివరాలను మీడియాకు ఫరాఖ్ సంఘ్వీ అందించారు.

ఆందోళన నిజమే...

ఆందోళన నిజమే...

ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన అమెరికాకు చెందిన ప్లేబాయ్ క్లబ్ గురించి తెలిసినవారందరూ ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు.

అలా ఉండదు..

అలా ఉండదు..

హైదరాబాదులో ఏర్పాటు చేసే ప్లేబాయ్ క్లబ్‌లో అలాంటి వాతావరణానికి ఏర్పాట్లు ఉండవని ఫరాఖ్ సంఘ్వీ స్పష్టం చేశారు. ఇక్కడి సంప్రదాయం ప్రకారమే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

తెలుగువారి సంప్రదాయాల ప్రకారం

తెలుగువారి సంప్రదాయాల ప్రకారం

భారతీయ విలువలకు, తెలుగువారి సంప్రదాయాలకు అనుగుణంగా అందులో పనిచేసేవారు ఉంటారని ఫరాఖ్ సంఘ్వీ చెప్పారు.

ఎ సర్టిఫికెట్ తొలగిస్తాం

ఎ సర్టిఫికెట్ తొలగిస్తాం

ప్లేబాయ్ క్లబ్‌కు ఉన్న ఏ సర్టిఫికెట్ ముద్రను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు క్లబ్ ఎండి ఫరాఖ్ సంఘ్వీ తెలిపారు.

శనివారం నుంచే..

శనివారం నుంచే..

శనివారం నుంచి నోవాటెల్ హోటల్లో ప్లేబాయ్ క్లబ్ ప్రారంభం అవుతుందని ఫరాఖ్ సంఘ్వీ తెలిపారు. దానికి అనుమతి ఇచ్చినట్లు సైబరాబాద్ పోలీసుల కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు.

English summary
Play Boy club MD Sangvi explained about the Hyderabad Play boy club. He said that it will run according to the Indian culture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X