రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధుల జమ ముహూర్తం ఖరారు..!!
రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 17వ విడత నిధుల జమకు ముహూర్తం ఖరారైంది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో..ఈ నిధుల విడుదల పైన కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. నిధుల రైతు ఖాతాల్లో జమ చేసేందకు కేంద్రం సిద్దమైంది. ఎన్నికలు పూర్తయిన తరువాత జూన్ తొలి వారంలోనే నిధుల జమ చేసేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీంతో..రైతుల నిరీక్షణ ఫలించనుంది.
17వ విడత నిధులు
కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు నిధులు రిలీజ్ చేసింది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏటా 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను సంవత్సరానికి మూడు విడతలుగా నేరుగా రైతుల అకౌంట్స్‌లో జమ చేస్తూ వస్తోంది.

ఎన్నికలు పూర్తవ్వగానే
ఏప్రిల్- జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా.. 2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు నిధులు రిలీజ్ చేసింది. ఈ పథకం ద్వారా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు 17వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇవి ఎప్పుడు అకౌంట్లలో జమ అవుతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఎన్నికల కోడ్ ఉండటంతో కేంద్రం అధికారికంగా నిర్ణయం వెల్లడించలేదు.
జూన్ తొలి వారంలో
ఎన్నికలు పూర్తయిన తరువాత జూన్ 2న ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బు అకౌంట్లో జమ అవుతుందని..లబ్దిదారుని బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఈ- కేవైసీ పూర్తి చేసేందుకు అధికారిక వెబ్ సైట్ ద్వారా రైతులు అవసరమైన సమాచారం ఇచ్చి పూర్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 80 శాతానికి పైగా రైతులు ఈ కేవైసీ పూర్తి చేసారు. ఇక..మిగిలిన వారు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications