ఎన్నికల కోడ్ తో PM Kisan, అన్నదాత సుఖీభవ నిధుల జమ వేళ కీలక నిర్ణయం..!!
ఏపీలో రైతుల ఖాతాల్లో ఈ రోజు నిధులు జమ కానున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను ఒకే సారి రైతుల ఖాతాల్లో జమ చేసేలా రంగం సిద్దమైంది. అయితే, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ కోడ్ అమల్లో ఉంది. దీంతో.. కోడ్ ఉల్లంఘన లేకుండా ఈ నిధుల జమ వేళ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండానే రైతుల ఖాతాల్లో జమ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు నిర్దేశించారు.
ఈ రోజు ఏపీలోని రైతుల ఖాతాల్లో రూ 6 వేలు జమ కానున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను విడుదల చేసేందు కు రంగం సిద్దమైంది. గుజరాత్లోని బనష్కాంతాలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో అన్నదాత సుభీభవ-పీఎం కిసాన్ నిధులను ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్దమైంది. దీని ద్వారా ఏపీలో 46,85,838 మంది రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత కింద రూ.3,125.47 కోట్లు చెల్లించనున్నారు. ఇందులో పీఎం కిసాన్ కింద ఒక్కో లబ్ధిదారు కు రూ.2వేలు చొప్పున రూ.782.55కోట్లు, అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతు కుటుంబానికి రూ.5వేలు చొప్పున రూ.2,342.92 కోట్లు జమ కానున్నట్లు లెక్కలు తేల్చారు. ఈ రోజు రైతుల ఖాతాల్లో నిధుల జమ పైన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.

ఎన్నికల కోడ్ తో అధికారులతో కార్యక్రమం
పీఎం కిసాన్ నిధులను కేంద్రం శుక్రవారం విడుదల చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను కూడా శుక్రవారమే విడుదల చేయాలని నిర్ణయించింది. రబీ రైతుల కోసం అనుకున్న సమయం కంటే ముందుగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతోపాటు నిధులు విడుదల చేస్తున్నందున శుక్రవారమే నిధులు విడుదల చేస్తున్నామని సీఎం తెలిపారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల కోడ్(ప్రవర్తన నియమావళి) అమలులో ఉంది. దీంతో.. ఈ నిధుల జమ సమయంలో ఎలాంటి కోడ్ ఉల్లంఘన లేకుండా జాగ్రత్తలు తీసు కొంటోంది. ఓటర్లను ప్రభావితం చేయకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించేలా నిర్ణయించారు.













Click it and Unblock the Notifications
