పీఎం కిసాన్ నిధుల జమపై కేంద్రం కీలక ప్రకటన, ఇలా తప్పనిసరి..!!
పీఎం కిసాన్ నిధుల విడుదల పై స్పష్టత వచ్చింది. 21వ విడత పీఎం కిసాన్ నిధుల జమ పైన కొంత కాలంగా రైతులు వేచి చూస్తున్నారు. పీఎం కిసాన్ నిధులతో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్న దాత సుఖీభవ రెండో విడత నిధులను విడుదల చేయాల్సి ఉంది. కాగా, పీఎం కిసాన్ అర్హుల జాబితా నుంచి పేర్లు తొలిగించినట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ పథకానికి సంబంధించిన వెబ్ సైట్ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచింది. ఇక, నిధుల జమ పైనా అధికారులు కీలక సమాచారం వెల్లడించారు.
పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతీ రైతుకు రూ 2 వేలు చొప్పున నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో 20వ విడత నిధులను విడుదల చేసారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం సైతం అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని చెప్పిన రూ 20 వేలలో పీఎం కిసాన్ నిధులు మినహాయించి.. మిగిలిన రూ 14 వేలు మూడు విడతులగా పీఎం కిసాన్ నిధులతో జమ చేసేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా ఆగస్టు లో పీఎం కిసాన్ తో కలిపి తొలి విడత గా రూ 5 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో, ఇప్పుడు పీఎం కిసాన్ కింద రూ 2 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడతగా రూ 5 వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. పీఎం కిసాన్ నిధులను ఈ నెలలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.

ఇక, పీఎం కిసాన్ పథకం లో లక్షలాది మంది రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితా నుండి తొలగింపు పైన పెద్ద ఎత్తన ప్రచారం సాగుతోంది. దీంతో, పీఎం కిసాన్ వెబ్ సైట్ లో అధికారులు ఈ అంశం పైన స్పష్టత ఇచ్చారు. అనేక మంది రైతుల పేర్లను తాత్కాలికంగా తొలగించడానికి గల కారణాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం అనర్హులు అయినప్పటికీ కొందరు లబ్ధిదారులు ఈ ప్రయోజనం పొందుతున్నారు. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ప్రయోజనం పొందవలసి ఉండగా.. చాలా కుటుంబాలలో భర్తలు, భార్యలు లేదా మైనర్ పిల్లలు విడివిడిగా దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమిని కొనుగోలు చేసిన రైతులు కూడా ఈ పథకం కింద ప్రయోజనాలు పొందకూడదు. ఈ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోని లేదా నిబంధనలను ఉల్లంఘించిన లక్షలాది మంది రైతుల పేర్లను తాత్కాలికంగా తొలగించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

కాగా, అర్హులైన రైతులకు తిరిగి అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. ధృవీకరణ తర్వాత అర్హత ఉన్న ప్రతీ రైతుకు తిరిగి లబ్ధిదారుగా గుర్తుంపు దక్కుతుందని స్పష్టం చేసింది. దీంతో.. ఇదే సమయంలో రైతులు PM కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించి వీటిని చెక్ చేసుకోవాలని సూచించారు. పోర్టల్ లో ఎలిజిబులిటీ స్టేటస్ ద్వారా అర్హులో కాదో స్పష్టత వస్తుంది. ఇక.. 21వ విడత నిధుల విడుదల పైన చర్చ జరుగుతోంది. వరుసగా తుఫాన్లు.. వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి రైతుల కు ఇప్పటికే 21వ విడత నిధులను విడుదల చేసారు. మిగిలిన రాష్ట్రాలకు దీపావళి సమయంలోనే జమ చేస్తారని భావించారు. అయితే.. బీహార్ ఎన్నికల కారణంగా బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. రేపు (మంగళవారం) బీహార్ లో పోలింగ్.. 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ తరువాత మూడో వారంలో ఈ నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications